Intinti Gruhalakshmi : సామ్రాట్ ను మోసం చేయబోయిన బెనర్జీకి బుద్ధి చెప్పిన తులసి.. లేకపోతే సామ్రాట్ రోడ్డు మీదికి వచ్చేవాడా? కంపెనీ మూతపడేదా?
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 2 జనవరి 2023 సోమవారం ఎపిసోడ్ 831 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హాస్పిటల్ లోనే నందు తులసితో గొడవ పెట్టుకుంటాడు. దీంతో తులసి కూడా ఏం మాట్లాడదు. తులసిని అనరాని మాటలు అనడంతో సామ్రాట్ నందుకు అడ్డొస్తాడు. అసలు నువ్వు ఎవరు మా ఫ్యామిలీ మ్యాటర్ లో జోక్యం చేసుకోవడానికి అని సామ్రాట్ పై కూడా నందు సీరియస్ అవుతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి శృతికి ఏం కాలేదు. కడుపులో బిడ్డ క్షేమంగా ఉంది అని చెప్పడం అందరూ ఊపిరి పీల్చుకుంటారు.
మేము వెళ్లి శృతిని చూస్తాం అని నందు వెళ్లబోతుండగా.. అతడిని ఆపి ఇంకా మీరు నాపై ఆరోపణలు చేస్తున్నారు. మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కుదరదు. మాకు కూడా ఇష్టాఇష్టాలు ఉంటాయి కాస్త ఓపిక పట్టండి. ఏం చేసినా చెల్లిపోతుంది.. అడిగేవాళ్లు లేరు అని నేను అనుకుంటాను అన్నారు కదా. కుటుంబం విషయంలో వాళ్లను మీకు దగ్గరగా ఉండేలా చేసింది కుటుంబం విడిపోకూడదని.. పిల్లలకు నాన్న ప్రేమను దూరం చేయకూడదని. అది మీకు అర్థం కాదు. మీరు అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా మీ పక్కన ఉన్న శని అడ్డుకుంటుంది అంటుంది తులసి. కోరి నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ.. మీరే వదిలేసి వెళ్లిపోయారు. దాన్నే వెన్నుపోటు అంటారు. మీకు పైసా సంపాదన లేకపోయినా పెళ్లాం మొగుడు ఇద్దరినీ సాదాను. మోసం చేసి మీ ఆవిడ ఇల్లు రాయించుకుంది చూడండి అది వెన్నుపోటు అంటే. ఇక వారసుడు విషయానికి వస్తే… వాడు నాకు కూడా వారసుడు అంటుంది తులసి.
దీంతో ప్రేమ్ కూడా అదే అంటాడు. ముందు వాడు నీ వారసుడు. ఆ తర్వాతే ఆయనకు అంటాడు ప్రేమ్. అలాగే.. సామ్రాట్ తో మా స్నేహ బంధం గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు బాగుండదు అని సీరియస్ అవుతుంది తులసి.
Intinti Gruhalakshmi : శృతిని డిశ్చార్జ్ చేసిన డాక్టర్లు
మరోవైపు తులసి, సామ్రాట్ తిరిగి ఇంటికి వెళ్తుంటారు. కారు మధ్యలో ఆపమంటుంది తులసి. నాకు అసలు ఆయన జోలికి వెళ్లాలని లేదు. మాటలు అనాలని లేదు. గతం తవ్వుకోవాలని లేదు. బలవంతంగా ఆయనే నాతో అన్నీ చేయిస్తున్నారు అంటుంది తులసి.
శృతికి అలా ఉంటే ఆయనకే టెన్షనా. నాకు ఉండదా? ఏ రోజూ శృతిని ప్రేమగా పలకరించని ఆ పెద్దమనిషికి.. ఈరోజు వారసుడి కోసం శృతి మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? మనిషి మారారేమో అని సంతోషపడ్డాను అంటుంది తులసి.
నేను ఇప్పుడే తొందరపాటు నిర్ణయాలు తీసుకోను. తండ్రీకొడుకులను విడదీయను అంటుంది. నా మొండితనం నటన.. నా ప్రేమ నిజం. అందుకే ఇబ్బంది పడుతున్నా అంటుంది తులసి. మన అనుకునే వాళ్ల కోసం ఇబ్బంది పడుతున్నా అందులో ఉండేది ప్రేమే సామ్రాట్ గారు అంటుంది.
కట్ చేస్తే బెనర్జీ గురించి తెలుసుకోవడం కోసం ఆయన పీఏతో మాట్లాడుతుంది తులసి. ఇంతలో ఆఫీసులో అగ్రిమెంట్ మీద సైన్ చేసేందుకు రెడీ అవుతుంటాడు సామ్రాట్. ఇంతలో తులసి వచ్చి వద్దు.. ఆగండి సార్ అని సామ్రాట్ ను ఆపుతుంది.
బెనర్జీ ఎవరో.. ఎలాంటి వ్యక్తో అతడి ముందే అన్నీ చెబుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.