Siddharth : అమ్మలా చూసుకునే నా తెలుగు వాళ్లే నన్ను వెళ్లిపో అంటే నేను బతికి వేస్ట్.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో సిద్ధార్థ్
Siddharth : అక్టోబర్ 6న సిద్ధార్థ్ నటించిన చిన్నా అనే సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సిద్ధార్థ్ కర్నాటకకు వెళ్తే అక్కడ ఆయన్ను మాట్లాడనివ్వకుండా బయటికి పంపించేశారు. దీంతో సిద్ధార్థ్ చాలా బాధపడ్డాడు. తాజాగా ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కు వచ్చాడు. అక్కడ కాస్త ఎమోషనల్ అయ్యాడు సిద్ధార్థ్. చిన్నా సినిమా తన లైఫ్ డ్రీమ్ అని.. ఆ సినిమా తీయడానికి 22 ఏళ్లు పట్టిందని చెప్పాడు. […]
Siddharth : అక్టోబర్ 6న సిద్ధార్థ్ నటించిన చిన్నా అనే సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సిద్ధార్థ్ కర్నాటకకు వెళ్తే అక్కడ ఆయన్ను మాట్లాడనివ్వకుండా బయటికి పంపించేశారు. దీంతో సిద్ధార్థ్ చాలా బాధపడ్డాడు. తాజాగా ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కు వచ్చాడు. అక్కడ కాస్త ఎమోషనల్ అయ్యాడు సిద్ధార్థ్. చిన్నా సినిమా తన లైఫ్ డ్రీమ్ అని.. ఆ సినిమా తీయడానికి 22 ఏళ్లు పట్టిందని చెప్పాడు. కెరీర్ స్టార్ట్ చేసే ముందు ఒక డ్రీమ్ ఉంటుంది. ఏదో ఒక రోజు ఒక సినిమా నేను తీస్తాను. అమ్మతోడు ఇంతకంటే బెటర్ సినిమా తీయలేను అని చెప్పే పరిస్థితి వస్తుంది అని సిద్ధార్థ్ చెప్పాడు. ఆ సినిమానే చిన్నా సినిమా అని చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్. నేను సొంత డబ్బు పెట్టుకొని ప్రొడ్యూస్ చేస్తాను. నేను సొంత డబ్బు సంపాదించి ఒక సినిమా కోసం డబ్బులు పెట్టి ట్యాక్స్ లు కట్టి ప్రొడ్యూస్ చేస్తాం అంటూ సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా సిద్ధార్థ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తారని నేను డైరెక్టర్ కి చెప్పాను అంటూ సిద్ధార్థ్ చెప్పాడు. ఒకేసారి ఈ సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని అనుకున్నాను. 4 నెలల ముందే ఈ సినిమా సెన్సార్ కూడా అయిపోయింది. ఫస్ట్ టైమ్ కన్నడ నేర్చుకొని కన్నడలో డబ్ చేశాను. కర్ణాటక వెళ్లి ప్రెస్ మీట్ పెడితే నువ్వేంట్రా తమిళోడు.. వెళ్లు గెట్ అవుట్ అన్నారు నన్ను. ఇదేంటి అని నేను అనుకున్నా. నేను నవ్వి బయటికి వెళ్లిపోయా. చాలా మంది ఎన్నో మాటలు అన్నారు. ప్రెస్ మీట్ జరగలేదు. రిలీజ్ అవుతుంది కదా అనే ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. తర్వాత చూస్తే తెలుగులో 28న రిలీజ్ చేయడానికి 45 రోజుల ముందు నుంచే డేట్ ఫిక్స్ చేశాను. సలార్ తో పాటు వద్దామని అనుకున్నాం. ఎందుకంటే నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ ను. సలార్ ను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఆ తర్వాత నా సినిమా చూసుకుంటా అని అనుకున్నా. ఆ తర్వాత వాళ్లు డేట్ మార్చేశారు. ఆ తర్వాత 10 మంది వచ్చారు ఆ డేట్ లో. ఎంతమంది వచ్చినా నాకు పర్లేదు. సిద్ధార్థ్ కొత్తవాడైతే కాదు.. అని చెప్పాడు.
Siddharth : తెలుగులో సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారు అని అడిగారు
తమిళనాడులో రెడ్ జాయింట్ వాళ్లు ఈ సినిమా చూసి ఉదయనిధి గారు ఈ సినిమాను కొన్నారు. కేరళలో కూడా ఈ సినిమాను చూసి వాళ్లు తీసుకున్నారు. కర్ణాటక వాళ్లు కూడా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. తెలుగులో సిద్ధార్థ్ సినిమానా ఎవరు చూస్తారు అని అడిగారు. సిద్ధార్థ్ సినిమా ఎందుకు చూస్తారండి.. ఎవరు చూస్తారు అని అడిగారు. నేను ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు నా సినిమా చూస్తారు అని చెప్పాను. ఇది 28న రిలీజ్ కావాల్సిన సినిమా. నా సినిమా తెలుగు ప్రేక్షకులు ఎందుకు చూస్తారు.. చూడరు అని చెప్పి నాకు థియేటర్లు దొరకలదు. ఆ టైమ్ లో నా దగ్గరికి వచ్చి నాకు మద్దతు ఇచ్చిన వాల్లు ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు. ఇంతకంటే మంచి సినిమా నేను తీయలేను సార్. ఈ సినిమా మీరు చూడండి.. ఈ సినిమాలో అది ఉంది.. ఇది ఉంది అని చెప్పను నేను. నేను ఇక్కడికి ఇంకా చెబుతున్నాను. నేను అడుక్కునే బ్యాచ్ కాదు. మీకు సినిమాల మీద నమ్మకం ఉంటే.. ఇష్టం ఉంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి.. అంటూ సిద్ధార్థ్ భావోద్వేగానికి గురయ్యాడు.