Silk Smitha : చివరి రోజులలో నరకయాతన… సిల్క్ స్మిత డెడ్ బాడీపై ఈగలు…!
Silk Smitha: ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారుని తనవైపుకి తిప్పుకున్న గ్లామరస్ బ్యూటీ సిల్క్ స్మిత. గ్లామర్ ప్రపంచంలో ఈ పేరు ఓ సెన్సేషన్ కాగా, మత్తు కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కి గ్లామర్ ఇమేజ్ అద్దిన అందమైన స్వప్నం సిల్క్ స్మిత. అప్పటివరకు ఉన్న కమర్షియల్ హంగులను మార్చేసి తన పేరుకే సరికొత్త బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది ఈ అమ్మడు . వ్యాంప్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్టార్‌డంను సొంతం చేసుకుంది. తన అందచందాలతో మత్తెక్కించిన సిల్క్.. నిజజీవితం మాత్రం అంతుచిక్కని కథలానే మిగిలిపోయింది. రంగుల ప్రపంచంలో అమాయకపు చిరునవ్వుల్ని మిగిల్చి తనను తాను అంతం చేసుకుంది. మలయాళం సినిమాతో వడ్లపట్ల విజయలక్ష్మిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్క్రీన్ నేమ్ సిల్క్ స్మిత గా మార్చుకోవటం జరిగింది. అప్పటినుండి తిరుగులేని స్టార్ హీరోయిన్ గా.. అనేక సినిమాలలో ఐటం సాంగ్స్ లో స్టెప్పులు వేస్తూ అందాల ఆరబోతలో అప్పట్లోనే సెగలు పుట్టించింది.
కేవలం సిల్క్ స్మిత పాట కోసం అప్పట్లో సినిమాలు కి వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. దాదాపు 90లలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోలందరి సరసన నటించిన హీరోయిన్గా సిల్క్ స్మిత ఒక రికార్డు ఉంది. ఓ సీనియర్ హీరో వలన స్కిల్క్ స్మిత కెరీర్ నాశనం అయిందంటూ పలు ఆరోపణలు వచ్చాయి. అవకాశాలు తగ్గుముకం పట్టడంతో సిల్క్ స్మిత డిప్రెషన్ లోకి వెళ్లి పోయింది. చివరికి సిల్క్ ఆ డిప్రెషన్ నుండి బయటికి రాలేక ఆత్మహత్య చేసుకుంది. 1996 సెప్టెంబర్ 23 న, స్మిత తన చెన్నై అపార్ట్మెంట్లో చనిపోయింది. అయితే ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్ద పెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను బలి తీసుకుందని అన్నవారు కూడా లేకపోలేదు. అప్పటి నటి అనురాధ ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మితతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ …
Silk Smitha : దారుణమైన జీవితం..
చనిపోవడానికి ముందు రోజు నైట్ సిల్క్ స్మిత తనకు కాల్ చేసిందన్నారు అనురాధ. అయితే తనను ఇంటికి రమ్మని అడిగిందన్నారు. అయితే ఆ సమయంలో తన భర్త బెంగుళూరు నుంచి వస్తున్నాడని.. పొద్దున్నే రానా అని తాను సిల్క్ స్మితతో చెప్పానన్నారు. సరే అయితే రేపు మార్నింగ్ వస్తావా అని తాను అడిగిందన్నారు. సరే వస్తాను.. బాబును స్కూల్‌కు పంపి వస్తానని.. సిల్క్ స్మితతో చెప్పానన్నారు. ఉదయం లేచి తన బిడ్దను స్కూల్‌కు రెడీ చేస్తుండగా.. సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుందన్న వార్త తెలిసిందన్నారు.అయితే ఆమె బాడీని పోస్టుమార్టంకు తీసుకెళ్లడంతో.. ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ స్ట్రెచర్‌పై ఉన్న సిల్క్ స్మిత డెడ్ బాడీపై ఈగలు వాలడం చూసి తనకు ఎక్కడ లేని బాధ,దుఖ: వచ్చాయన్నారు. ఆమె అందానికి,బాడీకి ఎంత క్రేజ్ ఉండేది.. అలాంటి బాడీ నిర్జీవంగా మారితే… దానిపై ఈగలు వాలుతుంటే మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందనే చాలా ఏడుపు వచ్చేసిందన్నారు అనురాధ.