Simran sister Monal : సిమ్రాన్ చెల్లెలు ఎందుకు సూసైడ్ చేసుకుంది? తనను ప్రేమించి మోసం చేసిన ఆ డాన్స్ మాస్టర్ ఎవరు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Simran sister Monal : సిమ్రాన్ చెల్లెలు ఎందుకు సూసైడ్ చేసుకుంది? తనను ప్రేమించి మోసం చేసిన ఆ డాన్స్ మాస్టర్ ఎవరు?

 Authored By aruna | The Telugu News | Updated on :7 August 2022,12:40 pm

Simran sister Monal : హీరోయిన్ సిమ్రాన్ గురించి అందరికీ తెలుసు. తెలుగుతో పాటు తమిళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది సిమ్రాన్. అయితే.. సిమ్రాన్ కు ఒక చెల్లెలు ఉందని, తను కూడా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించిందనే విషయం మీకు తెలుసా? చాలా సినిమాల్లో నటించిన సిమ్రాన్ చెల్లెలు చివరకు ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం, ఒక డాన్స్ మాస్టర్ అని సినీ ఇండస్ట్రీ అప్పట్లో కోడై కూసింది. అసలు సిమ్రాన్ చెల్లెలు మోనల్ ఏ సినిమాల్లో నటించింది. చివరకు ఎందుకు సూసైడ్ చేసుకుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. తన పూర్తి పేరు రాధా మోనల్ నవల్. ఢిల్లీలో 1981, జనవరి 26న మోనల్ జన్మించింది. డిగ్రీ చదువుతుండగానే మోనల్ కు సినిమా చాన్స్ లు వచ్చాయి.

హిందీతో పాటు పలు తమిళ్ సినిమాల్లోనూ నటించింది. తమిళ్ లో సూపర్ హిట్ మూవీ బద్రీలో నటించింది. తెలుగులో ఇష్టం సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ లో మెరిసింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది మోనల్. సిమ్రాన్ చెల్లెలుగా తనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. కానీ, తను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ డాన్స్ మాస్టర్ ను మోనల్ ప్రేమించింది. అతడిని గాఢంగా ప్రేమించింది. ఇద్దరు కూడా చెట్టాపట్టాలేసుకొని అప్పట్లో తిరిగారని వార్తలు వచ్చాయి. కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడ్డ సిమ్రాన్ చెల్లెలు అనే వార్తలు కూడా వచ్చాయి. ప్రాణానికి ప్రాణంగా అతడిని ప్రేమించింది, ఒక ఏడాది పాటు ఇద్దరూ కలిసి తిరిగారు. ఆ తర్వాత మోనల్ ను ఆ డాన్స్ మాస్టర్ దూరం పెట్టాడు. దీంతో మోనల్ తట్టుకోలేకపోయింది. మోనల్ ను నిజంగా ప్రేమించకుండా తనను శారీరకంగా వాడుకొని వదిలేసినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.

Simran sister Monal story in telugu

Simran sister Monal story in telugu

కానీ, తను మాత్రం అతడిని మనస్ఫూర్తిగా ప్రేమించింది. అయినా కూడా అతడు తనకు దూరం అయ్యాడు. మోనల్ ను కలవడానికి కూడా అతడు ఇష్టపడలేదట. తాను మోసపోయానని చివరకు గ్రహించింది. దీంతో ఇక తనకు బతకు వేస్ట్ అనుకొని తన చెన్నై ఫ్లాట్ లో ఏప్రిల్ 14, 2002 న ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది మోనల్. ఆమెకు ఆరోగ్యం బాగోలేక చనిపోయిందనే వార్తలు ముందు వచ్చాయి కానీ, లవ్ బ్రేకప్ కావడంతో గుండె పగిలి, తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని వచ్చిన వార్తలు తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. 20 ఏళ్లకే జరిగిన మోసాన్ని తట్టుకోలేక మోనల్ చనిపోయింది. ఇంతకీ ఆ కొరియోగ్రఫర్ ఎవరు అనే కదా మీ డౌట్. ఇదే విషయంపై అప్పట్లోనూ పలు వార్తలు వచ్చాయి.

సిమ్రాన్ చెల్లెలు మోనల్ ను మోసం చేసిన ఆ కొరియోగ్రఫర్ ఎవరంటూ అందరూ చర్చించుకున్నారు. అతడు ఎవరో కాదు.. ఫేమస్ కొరియోగ్రఫర్ ప్రసన్న సుజిత్ అంటూ అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కానీ, సుజిత్ మాత్రం ఏనాడూ ఈ విషయంపై మాట్లాడలేదు. ఒక సెట్ లో మోనల్ తో ఏర్పడిన పరిచయాన్ని ప్రేమ వరకు తీసుకెళ్లాడని, ఆ తర్వాత వాడుకొని మొహం చాటేశాడని న్యూస్ ఆరోజుల్లో సంచలనం సృష్టించింది. అలా, వెండి తెరపై స్టార్ హీరోయిన్ అవుదామనుకున్న మోనల్, బ్రేకప్ ను తట్టుకోలేకపోయింది. తన చెల్లెలు మరణాన్ని తట్టుకోలేక సిమ్రాన్ సైతం కొన్నాళ్ల పాటు మీడియాకు కనిపించకుండా ముంబై వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ సిమ్రాన్ కోలుకొని తెలుగు, తమిళంలో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది