Bigg Boss 6 Telugu : రేవంత్‌కు మండిపోయినట్టుంది.. బిగ్ బాస్ ఆటను అల్లకల్లోలం చేసేస్తాడా?
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం అడవిలో ఆట అనే టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో దొంగల బ్యాచ్‌లో రేవంత్, ఆరోహి, శ్రీహాన్, సుదీప, అర్జున్ ఇలా అందరూ ఉన్నారు. పోలీసులుగా ఆదిరెడ్డి, మెరినా రోహిత్, బాలాదిత్య ఇలా ఓ గ్యాంగ్ ఉంది. ఇక అత్యాశ కలిగిన వ్యాపారవేత్తగా గీతూ వ్యవహరిస్తోంది. ఇక నిన్నటి టాస్క్‌లో రేవంత్, శ్రీహాన్ కొన్ని విలువైన వస్తువులను దొంగిలించారు. దొంగలంతా కూడా ఒక టీంగా ఆడాలని అంతా అనుకున్నారు. కానీ ఎవరికి వారే ఆడటం మొదలుపెట్టేశారు.
శ్రీహాన్ వద్దే ఇప్పుడు ఎక్కువ డబ్బులున్నాయి. శ్రీహాన్ తాను తెచ్చిన బొమ్మలను గీతూకి అమ్ముకున్నాడు. అలా ఆరువేలు సంపాదించుకున్నాడు. ఇక రేవంత్ సైతం తన బొమ్మలను అమ్మేసుకున్నాడు. కానీ తక్కువ మొత్తంలోనే తెచ్చుకున్నాడు. దీంతో ఆరోహి, నేహా వంటి వారు హర్ట్ అయ్యారు. అందరం కలిసి ఆడదామని అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఇలా చేస్తున్నారు.. అంటూ వాపోయింది. అలా అయితే మా ఇష్టం ఉన్నట్టుగా మేం ఆడతాం అంటూ ఆరోహి కూడా అనేసింది.
దీంతో రోజు ఎపిసోడ్‌లో దొంగల దగ్గరే దొంగలు దొంగతనం చేస్తున్నారు. రేవంత్ దాచుకున్న బొమ్మలను ఆరోహి లేపేసింది. దీంతో రేవంత్‌కు మండిపోయింది. ఇంట్లో ఉన్న వాళ్లందరి బొమ్మలను దొంగతనం చేస్తాను అని చెప్పాడు. రాత్రి నిద్రపోదాం అనుకున్నా.. కానీ ఇప్పుడు మాత్రం అస్సలు నిద్రపోను.. ఈ గేమ్‌లో పోలీసులు గెలిచేలా చేస్తాను.. మన బొమ్మలన్ని వాళ్లకు ఇస్తాను అని మండిపోతుంటాడు. ఆదిరెడ్డికి తన బొమ్మలన్నీ అమ్మేస్తుంటాడు రేవంత్. అయితే ఆరోహి మాత్రం లైట్ తీసుకుంటుంది.
రేవంత్ ఫైర్ మీదున్నాడు అని అర్జున్ చెబితే.. ఫైర్ మీదుంటే నాకేంటి.. ఐస్ మీదుంటే నాకేంటి అని అంటుంది. ఇక రేవంత్ అయితే అన్ని బొమ్మలకు రెడ్ థ్రెడ్ కడుతున్నాడు. వీటిని బిగ్ బాస్ లెక్కలోకి తీసుకుంటాడా? లేదా? అన్నది చివరి వరకు తెలియడం లేదు.
View this post on Instagram