Bigg Boss 6 Telugu : బిగ్‌ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్‌గా సిరి బాయ్ ఫ్రెండ్..? | The Telugu News

Bigg Boss 6 Telugu : బిగ్‌ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్‌గా సిరి బాయ్ ఫ్రెండ్..?

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ -5 ముగిసి నెల రోజులు అన్న కాకముందే సీజన్ -6 కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. గతేడాది కరోనా కారణంగా బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో 19 కంటెస్టెంట్లు తన అదృష్టాన్ని పరిక్షించుకోగా చివరకు 5 గురు సభ్యులు టాప్ -5లో నిలిచారు.చివరగా వీజే సన్నీ బిగ్ బాస్-5 టైటిల్ విన్నర్‌గా నిలవగా, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :5 January 2022,6:00 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ -5 ముగిసి నెల రోజులు అన్న కాకముందే సీజన్ -6 కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. గతేడాది కరోనా కారణంగా బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో 19 కంటెస్టెంట్లు తన అదృష్టాన్ని పరిక్షించుకోగా చివరకు 5 గురు సభ్యులు టాప్ -5లో నిలిచారు.చివరగా వీజే సన్నీ బిగ్ బాస్-5 టైటిల్ విన్నర్‌గా నిలవగా, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్ రన్నరప్‌గా నిలిచాడు. ముఖ్యంగా ఈ సీజన్‌లో షణ్ముక్ అండ్ సిరి మధ్య జరిగిన సంభాషణలు, వీరి హగ్గులు, ముద్దుల వలనే టీఆర్ఫీ రేటింగ్ పెరిగిందని వార్తలు వైరల్ అయ్యాయి.

బిగ్‌బాస్ సీజన్ -5లో సిరి షణ్ముక్ రొమాన్స్ మాములుగా వైరల్ కాలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి గురించి చర్చ.. తప్పని తెలిసినా కమిట్ అయిపోయామని సిరి, షణ్ముక్ మాట్లాడటం.. ఫ్రెండ్స్ అంటూనే గట్టిగా హగ్గులు ఇచ్చుకోవడం, ఒకే బెడ్ పై పడుకోవడం, చేతిలో చేయ్యి వేసుకుని పిసుక్కోవడం ఇవన్నీ చూస్తే వీరు గేమ్ ఆడుతున్నారా? నిజంగానే కామంతో మునిగి రొమాన్స్‌లో తేలుతున్నారా? అని అనుమానం రాకమానదు. ఇక బిగ్ బాస్ ఎండ్‌లో కంటెస్టెంట్ల ఫ్యామిలీస్‌ను ఇంట్లోకి తీసుకురాగా.. సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ వచ్చి తన కోసం పాట పాడటం, వదిలేస్తున్నవారా? అని అడిగిన వీడియా తెగ వైరల్ అయ్యింది.

Siri Boyfriend Shrihan Bigg Boss Season 6 Contestant

Siri Boyfriend Shrihan Bigg Boss Season 6 Contestant

Bigg Boss 6 Telugu : సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ చాన్స్..

తర్వాత శ్రీహన్‌కు కూడా బయట ఫాలోయింగ్ పెరిగింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ -6 కోసం అతన్ని తీసుకునేందుకు నిర్వాహకులు ప్లాన్ చేశారట.. ఈసారి జబర్దస్త్ షో నుంచి పలువురు కమెడీయన్స్, ఈటీవీ వచ్చే డాన్స్ షో నుంచి ఒకరిని, యూట్యూబ్‌లో ఫేం అయిన వ్యక్తిని తీసుకోవాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.. ఇప్పటికే వెతుకులాట ప్రారంభించారని తెలిసింది. సీజన్-5 ముగింపు టైంలోనే బిగ్‌బాస్ సీజన్ -6ను మరో రెండు నెలల్లో ప్రారంభిస్తామని, గతంలో మాదిరిగా ఈసారి ఎక్కువ టైం తీసుకోమని నిర్వాహకులు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ ట్విస్ట్ ఎంటంటే సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్‌తో పాటు అతనికి జోడిగా ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసి సీజన్ -5లాగా కొత్తగా ప్లాన్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

mallesh

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...