Shanmuk : మరోసారి షణ్ముక్, సిరి అరాచకం.. ఈ సారి మరింత ఘాటు హగ్స్..
Shanmuk : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ రిలాక్స్ అయినట్లు కనబడుతోంది. అయితే, చివరి వారంలోనూ సిరి, షణ్ముక్‌లు తమ పర్ఫార్మెన్స్ తగ్గించడం లేదు. హగ్స్ డోసు ఇంకా పెంచేసి ప్రవర్తిస్తున్నారు. ఆడియన్స్ వారిని చూసి తిట్టుకునే కొలదీ వారు ఇంకా రెచ్చిపోతున్నారు. తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో ఏకంగా బెడ్ పైన అలా చేశారు.ఇటీవల ‘బిగ్ బాస్’ ఎపిసోడ్‌లో భాగంగా స్టేజీ మీదకు వచ్చిన సిరి లవర్ శ్రీహాన్ షణ్ముక్ జస్వంత్‌కు ఝలక్ ఇచ్చాడు.సన్నీకి నెంబర్ వన్ పొజిషన్ ఇచ్చేశాడు. ఇక సిరి మదర్ కూడా సిరి-షణ్ముక్ హగ్స్ పైన స్పందించింది.
ఈ సంగతి అలా ఉంచితే.. బిగ్ బాస్ షో లో సిరి-షణ్ముక్ మధ్య జరిగిన కన్వర్జేషన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. అర్ధరాత్రి సిరి బయట కూర్చొని ఉంటే.. షణ్ముక్ వచ్చి పక్కకు జరుగు అంటాడు. అందుకు సిరి అలక బూనుతుంది. ఈ ఇరుకు స్థలంలోకి నువ్వు రావడం అవసరమా అని షణ్ముక్ ను అడుగుతుంది. అయితే, అవేవీ పట్టించుకోని షణ్ముక్ ఓవర్ యాక్షన్ చేయకు.. ఇంకా మిగిలి ఉంది నాలుగు రోజులే..కాబట్టి సీన్ చేయొద్దు అని అంటాడు. అలా వీరి మధ్య సంభాషణలు జరిగాయి.ఇక నా పేరు రాసి చించేశావు అని సిరిని షణ్ముక్ అడుగుతాడు. ఈ క్రమంలోనే సిరి అలుగుతుంది.

siri shanmukh created scene in bigg boss 5 Telugu
Shanmuk : రిలాక్స్ మోడ్‌లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్..
ఏం ఆలోచిస్తున్నావ్ అని షణ్ముక్ అడిగినప్పటికీ స్పందించదు. నా ఆలోచనల గురించి నీకెందుకని షణ్ముక్‌ను ప్రశ్నిస్తుంది. ఇక వీకెండ్‌లో నాగార్జున వచ్చినపుడు ఎమోషన్స్ కంట్రోల్ చేస్తున్నాననే డిస్కషన్ కూడా వీరి మధ్య జరుగుతుంది. అంతలోనే ఒకరిపైన మరొకరు కామెంట్స్ కూడా చేసుకున్నారు. ఇక ఇద్దరూ బెడ్ పైన పక్కపక్కుక పడుకుని, ఒకరిపైన మరొకరు చేయి వేసుకుని ఉండటం చూసి ‘ఏంట్రా ఇది’ అని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అలా ఉండి మరీ.. నువ్వు నా జెన్యూన్ ఫ్రెండ్ రా సిరి.. అని షణ్ముక్ చెప్పడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.