Sitara : తల్లితో దిగిన క్యూట్ పిక్స్ షేర్ చేసిన సితార.. ముందు ఆ పని చేయండి అంటూ కామెంట్
Sitara : ఘట్టమనేని మహేష్ ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. సినిమాలలోకి రాకుండానే సెలబ్రిటీగా మారింది సితార. తన తండ్రి, అన్నతో చేసే చిలిపిపనులు.. చదువు, టాలెంట్ తో ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక హాలీవుడ్ మూవీ కి డబ్బింగ్ చెప్పి వావ్ అనిపించుకుంది. 9 ఏళ్ల చిన్న వయసులోనే చదువుతో పాటుసింగర్, డ్యాన్సర్.. మొత్తానికి మల్టీ టాలెంటెడ్ సూపర్ కిడ్ గా పేరు తెచ్చుకుంది. మరోవైపు దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఓ యూ ట్యూబ్ ఛానెల్ నడుపుతుంది. ఇందులో వారిద్దరు చేస సందడి తెగ వినోదం పంచుతూ ఉంటుంది.
తమ ఫ్యామిలీ తో కలిసి వెళ్ళిన విదేశాలకు సంబంధించిన మంచి మంచి ప్రదేశాలను కూడా తన ఛానల్ లో పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలారిస్తోంది సితార. ఇక తన తండ్రి సినిమాల పాటలకు డ్యాన్స్ లు చేస్తూ తెగ రచ్చ చేస్తుంటుంది. మహేష్ నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట కాగా, ఇటీవల ఈ సినిమా నుండి కళావతి పాట విడుదలైందిజ ఈ పాటకు అందంగా డ్యాన్స్ చేసింది సితార. ఈ వీడియోను మహేష్ తన ఇన్స్టాలో షేర్ చేస్తూ.. మై స్టార్.. నన్ను బీట్ చేసింది అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

sitara shares cute pics with her mother
Sitara : సితార సందడి మాములుగా లేదు..
సితార డ్యాన్స్ వీడియోకు మహేష్ సతీమణి.. సితార మథర్ నమ్రత కూడా రియాక్ట్ అయ్యింది. ఇంకా ఏం చెప్పగలను ?.. లవ్ లవ్ లవ్ యూ మై లిటిల్ వన్ అంటూ ట్యాగ్ చేసింది. మహేష్ తనయ డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. మహేష్ బాబును మించి సితార డ్యాన్స్ చేసి అదుర్స్ అని అన్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న సితార తాజాగా తన తల్లి నమ్రతతో కలిసి కొన్ని క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో సితారకు నమ్రత ముద్దులిస్తున్నట్టుగా ఉంది. మీ అమ్మతో కిస్ తీసుకోవడంలో చాలా గ్యాప్ వస్తే వెంటనే అమ్మ ముద్దు తీసుకోండని కామెంట్ పెట్టింది సితార.