Janasena MLA Candidates List : 50 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఖరారు.. ఇదే ఆ లిస్టు.. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నారంటే?
Janasena MLA Candidates List : వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోందా? లేక టీడీపీతో జత కడుతోందా? ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే.. అసలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీకి అభ్యర్థులు దొరుకుతారా? ఇవన్నీ పక్కన పెడితే.. జనసేన పార్టీ నుంచి ఓ 50 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టు అయితే ఫైనల్ అయిందట. దానికి సంబంధించిన లిస్టు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏంటి? అందులో పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నాగబాబు కూడా ఈసారి పోటీ చేస్తున్నారా? అనేది తెలియాలంటే దానికి సంబంధించిన లిస్టును మనం చూడాలి. జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తే అభ్యర్థుల్లో పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయనున్నారట. ఒకవేళ తిరుపతి నుంచి పవన్ పోటీ చేయకపోతే కిరణ్ రాయల్ పోటీ చేస్తారట.
Janasena MLA Candidates List : పవన్ ఇంకా ఎక్కడ పోటీ చేయనున్నారు?
తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, సత్తెనపల్లి నుంచి వెంకటఅప్పారావు లేదా శివ పార్వతి, గన్నవరం నుంచి రవి, మచిలీపట్నం నుంచి రామకృష్ణ, పెడన నుంచి బూరగడ్డ శ్రీకాంత్, పెడమలూరు నుంచి కుమార్, దెందులూరు నుంచి వెంకట్ రెడ్డి లేదా ఆదిశేషు, ఏలూరు నుంచి అప్పలనాయుడు, గుడివాడ నుంచి పవన్, పామర్రు నుంచి నరేష్, అవనిగడ్డ నుంచి వేణుగోపాల్, ఉంగుటూరు నుంచి ధర్మరాజు, పోలవరం నుంచి బాలరాజు, చింతలపూడి నుంచి ఈశ్వరయ్య, నూజివీడు నుంచి పాశం నాగబాబు, ఆచంట నుంచి సూర్యప్రకాశ్,
కైకలూరు నుంచి బీవీ రావు లేదా కొల్లి వరప్రసాద్, నర్సాపూర్ నుంచి బొమ్మడి నాయకర్, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ లేదా కొనికళ్ల గోవింద రావు, ఉండి నుంచి జుట్టుగ నాగరాజు, తాడెపల్లి గూడెం నుంచి శ్రీనివాసరావు, తణుకు నుంచి రామచంద్రారావు.. ఇలా 50 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మరి.. ఈ 50 మంది అంతా జనసేనకు చెందిన వాళ్లు. ఒకవేళ టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే.. టీడీపీ వీళ్లతో పోటీ చేయించడానికి ఒప్పుకుంటుందా? అనేది డౌటే. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో.