Sai Pallavi : సాయి పల్లవికి అంత పొగరు ఎందుకు.. మనం ఆమె కళ్లకు కనిపించడం లేదా..!!

Advertisement

Sai Pallavi : సాయి పల్లవి పొగరు గురించి ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు చాలా ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఆమె తన పొగరు ను తెలుగు సినిమా నిర్మాతల వద్ద చూపించిందని, తెలుగు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి ని చాలా తక్కువ సమయంలోనే నెత్తిన పెట్టుకొని మరీ తెలుగు ప్రేక్షకులు అభిమానించడం మొదలు పెట్టారు. లేడీ పవర్ స్టార్ అంటూ ఆమె కు బిరుదు ఇచ్చి కితాబు ఇచ్చారు. ఆమె ఎక్కడ కనిపించినా అభిమానులు వందలు వేలలో గుమ్మి గూడటం మొదలైంది. అలాంటి అభిమానం చూపిస్తున్న సమయంలో తెలుగులో నటించకుండా ఇప్పటికే చాలా సినిమాలకు నో చెప్పింది.

Advertisement

సరే అన్ని సినిమాలకు నో చెబుతుందేమో.. తెలుగులో నటించాలనే ఆసక్తి ప్రత్యేకంగా లేదేమో అలాగే ఇతర భాషల్లో కూడా ఆమె నటించదేమో అని ఆమె అభిమానులు భావించారు. కానీ తెలుగు లో నటించేందుకు నో చెబుతూనే మరో వైపు తమిళం లో ఏకంగా రెండు సినిమాలకు కమిట్‌ అయింది. తెలుగు సినిమాలకు నో చెబుతూ తమిళ సినిమాలకు ఓకే చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి అంటూ ఆమెని తెలుగు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గతంలో సాయి పల్లవి ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా తెలుగు సినిమాలు చేస్తుంది అని అభిమానులు ఎదురు చూశారు. కానీ తెలుగు సినిమాలకు మాత్రమే నో చెప్పడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement
social media trolls on Sai Pallavi due to she accepting only kollywood movies
social media trolls on Sai Pallavi due to she accepting only kollywood movies

తెలుగులో కంటే ఆమెకు తమిళంలో సినిమాలు చేయాలని ఆసక్తి ఉన్నట్లుగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులు అంతగా ఆమెని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు.. అలాగే తెలుగులో భారీ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఓకే చెబుతున్నారు. అయినా కూడా ఇలా తమిళ సినిమాలకు కమిట్ అవ్వడం తెలుగు సినిమాలకు ఆసక్తి చూపించక పోవడం ను అభిమానులు తప్పుపడుతున్నారు. సాయి పల్లకి మరీ ఇంత పొగరు ఎందుకు.. మన తెలుగు సినిమా ఆమె కు కనిపించడం లేదా అంటూ కొందరు మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Advertisement
Advertisement