Bigg Boss 6 Telugu : సూర్య రెమ్యూనరేషన్‌ ఎక్కువ అవ్వడం వల్లే ఎలిమినేట్‌ అయ్యాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : సూర్య రెమ్యూనరేషన్‌ ఎక్కువ అవ్వడం వల్లే ఎలిమినేట్‌ అయ్యాడా?

 Authored By prabhas | The Telugu News | Updated on :2 November 2022,6:40 pm

Bigg Boss 6 Telugu : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నుండి బలమైన కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం చాలా మందికి అనుమానాలను కలిగిస్తుంది. చలాకి చంటి ఖచ్చితంగా బిగ్ బాస్ ఫైనల్ వరకు ఉండే స్టామినా కలిగిన వ్యక్తి. అతడిని చాలా తక్కువ వారాలకే ఇంటికి పంపించేశారు. అంతే కాకుండా మరి కొందరిని కూడా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇలా జరుగుతుండడంతో ప్రేక్షకులు ఓట్లు వేస్తే ఎలిమినేట్ అవుతున్నారా లేదంటే బిగ్ బాస్ టీం తమ అవసరాల రీత్యా ముందుగా భావించినట్లుగా ఆడటం లేదనే ఉద్దేశంతో వారిని ఎలిమినేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు.

తాజా వీకెండ్ లో ఆర్ జె సూర్య ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాకింగ్ గా ఉంది. అతడు కచ్చితంగా టాప్ 5 వరకు వెళ్ళగలిగే సత్తా ఉన్న కంటెస్టెంట్ అనడం లో సందేహం లేదు. అతడి కంటే చాలా వీక్ అయినా రాజ్ మెరీనా రోహిత్ మరి కొందరు కూడా ఉన్నారు. అయినా వారు సేవ్ అయ్యి సూర్య ఎలిమినేట్ అవ్వడం పెద్ద జోక్ అన్నట్లుగా ఉంది అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. కచ్చితంగా ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అని.. చాలా మంది ఊహిస్తున్నారు.

social media trolls on star maa tv and Bigg Boss 6 Telugu team about rj surya fake elimination

social media trolls on star maa tv and Bigg Boss 6 Telugu team about rj surya fake elimination

కొందరు మాత్రం సూర్య రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువ అని.. అందుకే ఆయనను తప్పిస్తే షో నిర్వాహకులపై భారం తప్పుతుందనే ఉద్దేశంతో అతడిని ఎలిమినేట్ చేశారు అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ పారితోషికం తీసుకునే వారిని ఎక్కువ రోజులు కొనసాగించడం వల్ల ఆర్థికపరమైన భారం తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని మధ్యలోనే ఎలిమినేట్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పమంటున్నాయి. ఈ విమర్శలపై బిగ్ బాస్ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది