Dil Raju : నాకు వస్తున్న పేరు తట్టుకోలేక.. రాళ్లేసే బ్యాచ్ ఉంది దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..!!
Dil Raju : నిజామాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో “బలగం” సినిమాను తెరకట్టి ప్రదర్శించడంపై నిర్మాత దిల్ రాజు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమ సినిమాని చట్ట విరుద్ధంగా ప్రదర్శిస్తున్నారని.. అటువంటి ప్రదర్శనలను అడ్డుకోవాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా ఎస్పీకి దిల్ రాజు ప్రొడక్షన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బలగం ప్రదర్శనలపై పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు చేయటాన్ని కొంతమంది తప్పు పట్టడం జరిగింది. దిల్ […]
Dil Raju : నిజామాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో “బలగం” సినిమాను తెరకట్టి ప్రదర్శించడంపై నిర్మాత దిల్ రాజు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమ సినిమాని చట్ట విరుద్ధంగా ప్రదర్శిస్తున్నారని.. అటువంటి ప్రదర్శనలను అడ్డుకోవాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా ఎస్పీకి దిల్ రాజు ప్రొడక్షన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బలగం ప్రదర్శనలపై పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు చేయటాన్ని కొంతమంది తప్పు పట్టడం జరిగింది. దిల్ రాజుకు మనసు లేదని… ఆయనకు సంపాదన మాత్రమే ముఖ్యమని విమర్శలు చేశారు. అయితే ఈ కామెంట్లపై “బలగం” సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా హైదరాబాద్ ప్రెస్ మీట్ లో దిల్ రాజు స్పందించారు.
ఇంత అద్భుతమైన క్షణాల్లో చిన్న చిన్న డిస్టబెన్స్ తప్పడం లేదు. మేము కావాలని షోలు ఆపుతున్నట్లు మీడియా ద్వారా నిన్న నాకు తెలిసింది. మొదటిరోజు నిజామాబాద్ లో షోలు వేసినప్పుడు నేను చెప్పాను ఏ రకంగా నైనా.. ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాల అన్నది తమ కోరిక. ఈ క్రమంలో మొదట నిజామాబాద్ మా ఊరిలో షో వేసాం. మంచి సినిమా తీశామని అనుకున్నాం కానీ గొప్ప సినిమా అవుతుందని మేము ఊహించలేదు. ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లాలి అని ఆరోజే నేను అన్నాను అని గుర్తు చేశారు. సాధారణంగా థియేటర్, ఓటిటి, టీవీల ద్వారా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వెళ్తుంటాయి. కానీ ఇప్పుడు నాలుగో పద్ధతి కూడా ఉందని ఓలల్లో తెరలు కట్టి ప్రదర్శించటం బట్టి అర్థమయింది. ఈ నాలుగో ఆప్షన్ తెలియడంతో తమకే షాకింగ్ గా ఉందని…
ఊరుల్లో పరదాలు కట్టి ఇలా వేస్తారని అసలు ఊహించలేదు. ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి వాటిని మేము ఆపలేం. అయితే ప్రేక్షకులు ఈ సినిమా చూసి వాళ్ల కుటుంబాల్లో మనస్పర్ధలు పోయి కలిస్తే చాలు మా జన్మ ధన్యం అవుతాయి అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. మేము తీసిన సినిమా ద్వారా సమాజంలో చిన్న మార్పు వస్తుందంటే అంతకన్నా గొప్ప ఏమి ఉండదని… ఎన్ని డబ్బులు వచ్చిన ఏం చేసినా ఇవి జరగవు అని దిల్ రాజు అన్నారు. ‘డబ్బే ముఖ్యం కాదు. వ్యాపారపరంగా డబ్బు ముఖ్యమే. కానీ, మేం సినిమాను ఆపుతున్నాం.. చట్టపరంగా వెళ్తున్నామని కొందరు అంటున్నారు. మాకు కొన్ని చట్టపరమైన సమస్యలు ఉంటాయి. సినిమా తీసిన నిర్మాత ఓటీటీకి, శాటిలైట్‌కు ఇస్తాడు. ఓటీటీకి ఇచ్చినప్పుడు వాళ్ల దగ్గర నుంచి మాకు ఒత్తిడి వస్తుంది.
ఒత్తిడి వచ్చింది.. మాకు మెయిల్ పెట్టారు. ఇది కరెక్ట్ కాదు.. భవిష్యత్తులో అన్ని సినిమాలకు ఇలానే అయిపోతుందేమో అని వాళ్ల భయం. దాని కోసం మా లీగల్ టీమ్ ఒక ముందడుగు వేసిందే తప్ప సినిమా ఆపాలనే ఉద్దేశం మాకు లేదు’ అని దిల్ రాజు స్పష్టం చేశారు. కావలిస్తే సోలు ఎక్కడైతే అందుబాటులో లేవు మాకు తెలియజేయండి మేము ప్రత్యేకంగా షోలు వేస్తామని స్పష్టం చేశారు. నేను ఏదైనా నిజాయితీగా ఉంటాను. దీంతో నాకు వస్తున్నా పేరు తట్టుకోలేక ఒక బ్యాచ్ రెడీగా ఉంటది. ఎప్పుడు రాలేద్దామా..అని అయితే దానికి కూడా నేను రెడీ గానే ఉంటాను. ఎందుకంటే నేను ఎప్పుడూ తప్పు చేయనప్పుడు… ఎవరిని లెక్క చేసేది ఉండదు. నా హృదయం కల్మషం లేనిది కాబట్టి మంచి సినిమాలు తీయగలుగుతున్నాను.. అని దిల్ రాజు వెల్లడించారు.
https://youtu.be/xxWvqywAvAI