Sonam Kapoor : త్వరలో తల్లి కాబోతున్న సోనమ్ కపూర్.. బేబి బంప్‌తో కిల్లింగ్ లుక్స్
Sonam Kapoor : ఈ మధ్య కాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కొద్ది రోజులకు తాము ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. కొద్ది రోజులుగా కాజల్ అగర్వాల్ తన బేబి బంప్‌తో సందడి చేస్తుండగా, ఇప్పుడు సోనమ్ కపూర్ సర్‌ప్రైజ్‌లు ఇస్తుంది. తాను తల్లి కాబోతున్న విషయాన్ని స్వయంగా సోనమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భర్తలో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘నాలుగు చేతులు. మేము చేయగలిగినంత ఉత్తమంగా నిన్ను పెంచడానికి. రెండు హృదయాలు. అవి నీతో కలిసి అడుగడుగునా కొట్టుకుంటాయి. నీపై ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు కురిపించే ఒక కుటుంబం నీ రాక కోసం ఎదురుచూస్తుంది’.
అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో కరీనా కపూర్, జాన్వీ కపూర్, ఏక్తా కపూర్ సహా పలువురు సెలబ్రిటీలు,నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.తాజాగా సోనమ్ కపూర్ బర్త్ డే పార్టీకి హాజరు కాగా, ఆ పార్టీలో ఈ అమ్మడు తెగ సందడి చేసింది. ట్రెండీ వేర్ దుస్తులలో బేబి బంప్ చూసిస్తూ కేక పెట్టించింది. అందాల ముద్దుగుమ్మ స్టన్నింగ్ పోజులకి కుర్రకారు మైమరచిపోతున్నారు. సోనమ్ క్యూట్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనమ్ బేబి బంప్ పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు సోనమ్ పిక్స్ కి నెటిజన్స్ అద్దిరిపోయే కామెంట్స్ పెడుతున్నారు.

sonam kapoor baby bump pics viral
Sonam Kapoor : సోనమ్ స్టన్నింగ్ లుక్స్..
2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ళ తర్వాత సోనమ్ కపూర్,ఆనంద్ దంపతులు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ గర్భవతి. త్వరలో ఆనంద్, సోనమ్ తల్లి దండ్రులు కాబోతున్నారు. సోనమ్ కపూర్ చివరగా జోయా ఫాక్టర్ అనే చిత్రంలో నటించింది. ఈ ఏడాది సోనమ్ కపూర్ బ్లైండ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సోనమ్ గర్భవతి కావడంతో కొంత కాలం ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాల్సిందే.