Karthika Deepam : ‘కార్తీక దీపం’ సౌర్య, హిమల రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా?
Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్ ‘కార్తీక దీపం’.. ఈ సీరియల్ టైమ్ అయిందంటే చాలు.. ప్రేక్షకులు ఎంత పని ఉన్నప్పటికీ టీవీలకు అతుక్కుపోయి మరి సీరియల్ చూస్తుంటారు. ఈ సీరియల్ పాత్రలు అయినటువంటి డాక్టర్ బాబు, వంటలక్క, ఇతర పాత్రల గురించి ప్రతీ రోజు చర్చించుకుంటారు. ‘కార్తీక దీపం’ సీరియల్‌కు ఎప్పుడూ టాప్ రేటింగ్ ఉంటుంది. ఈ సీరియల్‌లో ప్రధాన పాత్రధారులు..
అయినటువంటి దీప అలియాస్ వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ అలియాస్ నిరుపమ్‌ల తర్వాత అంతటి క్రేజ్ వీళ్ల కూతురు సౌర్య, హిమ పాత్రలకు ఉంటుంది. ప్రేక్షకులు సౌర్య, హిమ పాత్రలను ఎంతో ఇష్టపడుతుంటారు. సీరియల్ కథలో కీలక మలుపులు వీరి ద్వారానే తిరుగుతుందని ప్రేక్షకులు చర్చించుకుంటారు. మనస్పర్థల కారణంగా విడిపోయిన దీప, కార్తీక్‌లను మళ్లీ కలిపే బాధ్యత వీరు తీసుకుంటారని అనుకుంటుంటారు.
Karthika Deepam : ఈ సీరియల్‌కు టాప్ రేటింగ్..

sourya hima remunerations in karthika deepam
ఇకపోతే తల్లి దండ్రుల విషయంలో సౌర్య, హిమ పాత్రలు ఆలోచించే విధానం నుంచి మొదలుకుని ఏమేమి మాట్లాడుతున్నారనేది ప్రేక్షకులకు ఆసక్తికరమైన అంశంగా ఉంటుంది. ఈ సీరియల్‌లో ఇటీవల కాలంలో కాస్త కొత్తదనం కనబడుతోంది. ఇందులో నటించే పిల్లలు చిచ్చర పిడుగులుగా మారి వారి నటన, ఆలోచనా శక్తిలో కొంత మార్పులు అయితే కనబడుతున్నాయి. వాళ్ల పాత్రలు ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నాయి. ఇకపోతే వీరు తమ పాత్రలు పోషిస్తున్నందుకుగాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ విషయమై సోషల్ మీడియాలో డిస్కషన్ బాగానే జరుగుతున్నది.
కాస్ట్యూమ్స్ విషయంలో వీరు అస్సలు వెనుకడుగు వేయడం లేదు. ఇందులో హిమ చూడటానికి నలుపు రంగులో ఉన్నప్పటికీ పాత్ర కోసం కాదనకుండా నటిస్తోంది. ఇక సౌర్య, హిమలు ఇద్దరూ పాత్ర కోసం ఒక్క రోజుకు రూ.7 వేలు తీసుకుంటారట. అయితే, ఈ విషయమై వారి నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. కానీ, అంత తీసుకుంటున్నారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది.