Jr Ntr : ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ డుమ్మా కొట్ట‌డానికి కార‌ణం ఇదే ..!!

Advertisement

Jr Ntr : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం నేడు ఆయన ముద్రగలిగిన వంద రూపాయల నాణెం విడుదల చేయడం జరిగింది. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు నారా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం సినీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

అయితే కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న “దేవర” సినిమా షూటింగ్ కారణంగా ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ డుమ్మా కొట్టినట్లు టాక్. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ కి అదేవిధంగా లక్ష్మీపార్వతికి ఆహ్వానాలు పంపలేదని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్రం విడుదల చేసిన 100 రూపాయల నాణెం కార్యక్రమానికి ఎన్టీఆర్ గైర్హాజరావటం సంచలనంగా మారింది. ఒక్కరోజు షూటింగ్ వాయిదా వేసుకుని ఎన్టీఆర్ వెళ్లి ఉండుంటే బాగుండేదని అభిమానులు అంటున్నారు.

Advertisement
sr ntr 100 rupees coin program
Jr Ntr : ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ డుమ్మా కొట్ట‌డానికి కార‌ణం ఇదే ..!!

కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న “దేవర” తారక్ కెరియర్ లో 30వ సినిమా. ఈ సినిమాలో దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. “RRR” తర్వాత చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో “దేవర” విడుదల కాబోతోంది.

Advertisement
Advertisement