Sreeja Konidela : అన్నీ పరిష్కరించబడ్డాయ్.. ఇక నవ్వులే.. శ్రీజ కొణిదెల పోస్ట్ వైరల్
Sreeja Konidela : శ్రీజ కొణిదెల ప్రస్తుతం తన భర్తకు దూరంగా ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. మెగా డాటర్ శ్రీజ పెళ్లి విషయాలు నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. మొదటి పెళ్లి, ఆ విడాకుల వ్యవహారం మీద ఎన్నో రకాల కథనాలు వచ్చాయి. మొత్తానికి శ్రీజ రెండో పెళ్లి చేసుకుంది. కళ్యాణ్ దేవ్ శ్రీజ జంట బాగానే ఉందని అందరూ అనుకున్నారు. ఈ ఇద్దరికి నవిష్క పుట్టింది.అయితే అంతా సవ్యంగానే జరుగుతుందనే సమయంలో మాత్రం వ్యవహారం బెడిసి కొట్టేసింది.
శ్రీజ, కళ్యాణ్ దేవ్‌ల మధ్య మనస్పర్థలు వచ్చినట్టున్నాయ్. మొత్తానికి ఈ ఇద్దరూ మాత్రం విడివిడిగానే ఉంటున్నారు. శ్రీజ అయితే కనీసం తన భర్త కళ్యాణ్ దేవ్ పేరుని కూడా పక్కన ఉంచుకోవడం లేదు. తన ఇన్ స్టా హ్యాండిల్‌లో కళ్యాణ్ అనే పేరుని తీసేసింది. శ్రీజ కొణిదెలగా మార్చుకుంది.ఆ దెబ్బతో విడాకుల రూమర్లు ఒక్కసారిగా హైలెట్ అయ్యాయి. అయితే ఈ విడాకుల వ్యవహారం మీద ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ ఇద్దరూ కలిసి ఉన్నట్టుగా కూడా ఎక్కడా ఒక్క పోస్ట్ కూడా కనిపించడం లేదు.
నివృత్తి, నవిష్కలతో శ్రీజ ఒక్కతే సరదాగా సమయాన్ని గడుపుతోంది. ఇక నవిష్క చేసే అల్లరిని మాత్రం కళ్యాణ్ దేవ్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ వస్తున్నాడు.తాజాగా శ్రీజ కొణిదెల ఓ పోస్ట్ వేసింది. ఇందులో చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అన్నీ పరిష్కరించబడ్డాయ్.. ఇక అలా కూర్చుని జస్ట్ నవ్వుతూ ఉండటమే.. గ్రాటిట్యూడ్, కాంపషన్, కైండ్ నెస్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లను షేర్ చేసింది. అంటే ఈ పోస్ట్ ఉద్దేశ్యం ఏంటో శ్రీజకే తెలియాలి.