Sreeja Konidela : శ్రీజ విడాకుల విషయంపై కొత్త కొత్త రూమర్స్.. మెగా మౌనంతో పుట్టుకొస్తున్న పలు అనుమానాలు
Sreeja Konidela : ఇటీవలి కాలంలో సెలబ్రిటీల విడాకులకి సంబంధించి చాలా వార్తలు వింటున్నాం. గత ఏడాది సమంత- నాగ చైతన్య విడాకుల వ్యవహారం సంచలనం సృష్టించగా, ఈ ఏడాది ధనుష్- ఐశ్వర్య వ్యవహారం హట్ టాపిక్‌గామారింది. ఇక మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా విడాకులు తీసుకుందనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. కళ్యాణ్ దేవ్, శ్రీజ విడిపోయారు అని చెప్పడానికి దానికి మరో ప్రూఫ్ కూడా దొరికినట్టయ్యింది. అదేంటంటే.. శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. నిజానికి కళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజా కళ్యాణ్‌గా మార్చుకున్నారు. కాని ఇటీవల శ్రీజ కొణిదెల అని మార్చింది.
శ్రీజ ఇటీవలి కాలంలో షేర్ చేస్తున్న ప్రతి పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను మార్చినప్పటి నుండి భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేయడం ఆపేసింది. ఇవి రూమర్స్‌కు మరింత ప్రాణం పోశాయి. ఇటీవల అన్నయ్య రామ్ చరణ్‌తో కలిసి హాలీడేకు ముంబాయ్‌కు వెళ్లింది శ్రీజ. హాలీడేకు ఇద్దరే ఎందుకు వెళ్లారు అని అందరూ కన్ఫ్యూజన్‌లో ఉన్న సమయంలోనే శ్రీజ ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘హగ్స్.. ఇవే నేను ఇంకా సంతోషంగా బ్రతికుతున్నందుకు కారణాలు’ అని అన్నయ్య రామ్ చరణ్‌తో దిగిన ఫోటోను షేర్ చేసింది శ్రీజ.

sreeja posts creates so many doubts
Sreeja Konidela: శ్రీజ విడాకులు వ్యవహారంలో ట్విస్ట్..
ఈ పోస్ట్ చూశాక జనం ఇంకాస్త లోతుగా ఆలోచించి.. ఇన్‌డైరెక్ట్‌గా విడాకుల ఇష్యూపైనే శ్రీజ ఇలా తన ఫీలింగ్స్ బయటపెట్టిందని చెప్పుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్స్ తమ సోషల్ మీడియా ద్వారానే విడాకుల విషయంపై హింట్ ఇస్తున్నారు. ఆ క్రమంలో శ్రీజ కూడా ఇలాంటి సందేశాలు పోస్ట్ చేస్తుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ కూడా ఈ వార్తలపై ఏ మాత్రం స్పందించడం లేదు. దీంతో శ్రీజ విడాకుల వ్యవహారం రోజురోజుకి కొత్త అనుమానాలు కలిగేలా చేస్తుంది.