Sreemukhi : శ్రీముఖి జాతి రత్నాల్లో కూడా మళ్లీ వాళ్లేనా.. మల్లెమాల వాళ్లను వదలదా?

 Authored By prabhas | The Telugu News | Updated on :31 March 2022,12:30 pm

Sreemukhi : ఈటీవీ సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి.. ఈ టీవీ లో పెద్ద సినిమాలు టెలికాస్ట్ అవ్వడం లేదు.. ఈ టీవీ వారు భారీ బడ్జెట్ తో కార్యక్రమాలను నిర్వహించే పరిస్థితి లేదు. అయినా కూడా స్టార్ మా టీవీ తర్వాత స్థానంలో ఈటీవీ కొనసాగుతుంది అంటే అది ఖచ్చితంగా మల్లెమాల వారు అందిస్తున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, క్యాష్‌ ఇంకా ఢీ డాన్స్ షో. వీటి వల్లే ఈ టీవీ నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అదే మల్లెమాల వారు ఈటీవీ ప్లస్ టాప్ చానల్ టాప్ గా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మల్లెమాల ద్వారా వచ్చిన షోలతో ఈటీవీ ప్లస్ మెల్ల మెల్లగా గుర్తింపు దక్కించుకునే పరిస్థితికి వచ్చింది.

తాజాగా ఈ టీవీలో జాతిరత్నాలు అనే స్టాండప్ కామెడీ షో చేసేందుకు సిద్ధమయ్యారు. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించబడుతుంది. కామెడీ షో కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే విడుదల అయింది. ఏప్రిల్ లో మొదలు కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. భారీ అంచనాలున్నాయి ఈ షో కి సంబంధించిన ప్రోమోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కామెడీ అనేది అత్యంత ముఖ్యమైనది.. కనుక జాతి రత్నాలు కూడా కామెడీతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేసే విధంగా ఉంటుంది అంటూ శ్రీముఖి హామీ ఇస్తోంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కమెడియన్స్ ను వెలికి తీయడం.

Sreemukhi etv plus jathiratnalu standup comedy show interesting update

Sreemukhi etv plus jathiratnalu standup comedy show interesting update

జాతి రత్నాలు షో లో అంతా కొత్తవారే ఉంటారని భావించారు. కానీ మల్లెమాల వారు జబర్దస్త్ కమెడియన్స్ ని వదిలి పెట్టకుండా జాతి రత్నాలు షో లో కూడా వారిని తీసుకు వస్తారని తెలుస్తుంది. జబర్దస్త్ కు చెందిన దాదాపు నలుగురు లేదా ఆరుగురు కమెడియన్స్ జాతి రత్నాలు స్టాండప్ కామెడీ షో లో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. పూర్తి గా కొత్త వారైతే కచ్చితంగా షో ప్రేక్షకులకు నచ్చక పోవచ్చు. అందుకే వారిని తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగానే కొత్త వారు కూడా ఉంటే మంచిదే కానీ.. అదే పాత వారు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా కనిపించి ఇప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తే బోర్‌ కొట్టదా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి