Sreemukhi : అవినాష్ పెళ్లి.. శ్రీముఖి హడావిడి

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 20 October 2021, 7:30 am

Sreemukhi జబర్దస్త్ అవినాష్ ఓ ఇంటి వాడు కాబోతోన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి అవినాష్ పెళ్లి గోల మొదలైంది. ఏ టాస్క్ జరిగినా, ఎవరితో పులిహోర కలిపినా ఇంకా నాకు పెళ్లి కాలేదు.. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటూ కామెంట్ చేసేవాడు. అరియానాతో పులిహెర కలపడంపై నాగార్జున సెటైర్లు వేసినా కూడా.. అవినాష్ అలానే అనేవాడు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సర్ అలా అనకండి అంటూ నెత్తి నోరు కొట్టుకునే వాడు.

Sreemukhi In Jabardasth Avinash Anuja Marriage

Sreemukhi In Jabardasth Avinash Anuja Marriage

మొత్తానికి అవినాష్‌కు పిల్ల దొరికింది. తాను పెళ్లి చేసుకోబోతోన్నాను అంటూ తన పెళ్లిని కూడా టీఆర్పీ కోసం వాడుకున్నాడు. పండుగ ఈవెంట్‌లో తనకు కాబోయే భార్యను అందరికీ పరిచయం చేశాడు. అనూజ అంటూ తనకు కాబోయే శ్రీమతిని తెర మీదే అందరికీ చూపించాడు. అలా మొత్తానికి అవినాష్ అనూజ జోడి గురించి అందరికీ తెలిసిపోయింది. పెళ్లికి ముందే ఈ ఇద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్ అని నానా హంగామా చేశారు. ఆ షూట్‌లో శ్రీముఖి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

Sreemukhi సందడిగా అవినాష్ పెళ్లి..

Sreemukhi In Jabardasth Avinash Anuja Marriage

Sreemukhi In Jabardasth Avinash Anuja Marriage

అవినాష్ తన ఫియాన్సీతో ప్రేమగా ముచ్చట్లు పెడుతూ పోజులు ఇస్తూ ఫోటోలు దిగుతుంటే మధ్యలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేది. అలా శ్రీముఖి మొత్తానికి హడావిడి చేసేసింది. ఇక ఇప్పుడు అవినాష్ పెళ్లి జరుగుతోంది. ఈ సందర్భంగా హడావిడి మొత్తం శ్రీముఖిదే అన్నట్టు కనిపిస్తోంది. హల్దీ, మెహందీ ఈవెంట్ దగ్గరి నుంచి శ్రీముఖి తనమార్క్ చూపిస్తోంది. పెళ్లి, రిసెప్షన్ అంటూ శ్రీముఖి ఈ పెళ్లి గురించి అందరికీ ప్రమోషన్ చేసేస్తోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp