Sreemukhi : వామ్మో కోరికలు మామూలుగా లేవు.. రోల్స్ రాయిస్ కొంటానంటోన్న శ్రీముఖి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : వామ్మో కోరికలు మామూలుగా లేవు.. రోల్స్ రాయిస్ కొంటానంటోన్న శ్రీముఖి

 Authored By aruna | The Telugu News | Updated on :14 August 2022,1:20 pm

Sreemukhi : బుల్లితెరపై ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న యాంకర్లలో శ్రీముఖి ముందుంటుంది. సుమ సైతం కేవలం ఒక్క చానెల్లోనే పని చేస్తోంది. ఇంతకు ముందు జీ తెలుగు, స్టార్ మా, ఈటీవీ అంటూ సుమ సందడి చేసేది. కానీ ఇప్పుడు సుమ మాత్రం కేవలం క్యాష్ షోలోనే కనిపిస్తోంది. మరెక్కడా కూడా బుల్లితెరపై షోలు చేయడం లేదు. ఆమెకు సినిమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లే సరిపోతోన్నాయి.అయితే ఇప్పుడ సుమ స్థానాన్ని భర్తీ చేసేందుకు అన్నట్టుగా శ్రీముఖి అన్ని చానెళ్ల్లో ఒక్కో ప్రోగ్రాం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈటీవీలో జాతి రత్నాలు, జీ తెలుగులో సింగింగ్ షో, స్టార్ మాలో బిగ్ బాస్ కంటెస్టెంట్లుతో చేసే స్పెషల్ ఈవెంట్లను శ్రీముఖి కవర్ చేసేస్తోంది. ఇప్పుడు శ్రీముఖి మాత్రం బుల్లితెరపై తెగ సందడి చేస్తోంది.

ఎక్కడ చూసినా ఆమె అన్నట్టుగా ఉంది. ఇక ఇప్పుడు జాతి రత్నాలు షో వంద ఎపిసోడ్ రాబోతోందట. ఈమేరకు వదిలిన ప్రోమో అదిరిపోయింది. ఇందులో శ్రీముఖి గ్యాంగ్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. అయితే శ్రీముఖి ఆశలకు హద్దుల్లేకుండా పోయాయ్. చేసింది వందో ఎపిసోడ్.. కానీ లక్ష ఎపిసోడ్‌ గురించి ఆలోచించింది. లక్ష ఎపిసోడ్ వరకు నాకు రోల్స్ రాయిస్.. ఇమాన్యుయేల్‌కు బెంజ్.. మా గుమాస్తా తాతకు తోపుడు బండి అంటూ ఇలా సెటైర్లు వేసుకుంటూ పోయింది. మొత్తానికి తన లిస్ట్‌లో మాత్రం పెద్ద కారే ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్యే శ్రీముఖి కొత్త ఇంటిని కట్టించేసింది. కారు కూడా కొన్నట్టు కనిపిస్తోంది. కానీ మాటల్లో మాట తనకు రోల్స్ రాయిస్ కారు అంటే ఇష్టమున్నట్టు కనిపిస్తోంది.

Sreemukhi in Jathi Ratnalo 100th episode promo

Sreemukhi in Jathi Ratnalo 100th episode promo

మరి కోట్లు ఖరీదు చేసే కారుని శ్రీముఖి కొంటుందా? లేదా? అన్నది చూడాలి. జాతి రత్నాలు షో మాత్రం ఫుల్ సక్సెస్ అయింది. శ్రీముఖి, పంచ్ ప్రసాద్, ఇమాన్యుయేల్, నూకరాజులు కామెడీ బాగానే పండిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ గ్యాంగులోకి శాంతి స్వరూప్ కూడా వచ్చేశాడు. వచ్చీ రాగానే శాంతి మీద దారుణంగా కామెంట్లు వేశారు. గుడిసెల్లో ఉంటాడు అంటూ దారుణంగా పంచ్‌లు వేసేశారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది