Prabahs : ప్ర‌భాస్ పెళ్లి అవ్వాలి, ఆ త‌ర్వాతే నా పెళ్లి అంటున్న బిగ్ బాస్ బ్యూటీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabahs : ప్ర‌భాస్ పెళ్లి అవ్వాలి, ఆ త‌ర్వాతే నా పెళ్లి అంటున్న బిగ్ బాస్ బ్యూటీ

 Authored By sandeep | The Telugu News | Updated on :6 April 2022,7:30 pm

Prabahs : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి విష‌యం ఇప్ప‌టికీ స‌స్పెన్స్‌గానే మారింది. ఆయ‌న పెళ్లిపై ఎప్ప‌టి నుండో అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి.ఇదిగో అదిగో అంటూ కాలం గ‌డిపేస్తున్నారు. అయితే ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటే చూడాల‌ని ఆయ‌న అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ప్ర‌భాస్‌ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు రెడీగా ఉంటారు. ఓ నటీ అయితే ప్రభాస్ పెళ్లి అయితే కానీ తాను పెళ్లి చేసుకోను అని చెబుతుంది.. ఆమెనే శ్రీరాపాక. నటీ కాకముందు పలు సినిమాలకి ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసిన శ్రీరాపాక.. ఆర్జీవీ నగ్నం షార్ట్ ఫిలింతో హీరోయిన్‌‌గా మారింది.

బిగ్ బాస్ నాన్ స్టాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ షోతో అంద‌రి దృష్టి ఆకర్షించిన శ్రీరాపాక రెండో వారంలో హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు చేస్తూ బిజీబిజీ అయిపోతుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ … ప్రభాస్ అంటే తనకి చాలా ఇష్టమని, తాను ఇంటర్ చదువుతున్న టైమ్ నుంచే ప్రభాస్ అంటే పిచ్చి అని చెప్పుకొచ్చింది. ప్ర‌భాస్‌ నటించిన ఈశ్వర్‌ మూవీ బాగా ఇష్టమని, అప్పటి నుంచి ప్రభాస్‌ అంటే క్రష్‌ అని చెప్పింది. మరి ఆయనను పెళ్లి చేసుకుంటారని అడగ్గా.. అంతకంటే అదృష్టమా అని సమాధానం ఇచ్చింది. అప్ర‌భాస్‌ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు జీవించిన చాలు అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

sri rapaka wants to marry prabhas

sri rapaka wants to marry prabhas

Prabahs : ప్ర‌భాస్ పెళ్లి కోసం ఎదురు చూపులు..

అయితే ఎలాగు అది జరగదు కాబట్టి ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంత వరకు వెయిట్‌ చేస్తానని, ఆయన పెళ్లి తర్వాతే తను పెళ్లి పీటలు ఎక్కుతానంది. ఒకవేళ ఆయన పెళ్లి చేసుకోకపోతే తాను కూడా ఎప్పటికీ మ్యారేజ్‌ చేసుకోనని పేర్కొంది. ఇకపోతే ప్రభాస్ పెళ్లి అనుష్కతో ఉంటుందని వస్తున్న వార్తలకైతే లెక్కే లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన ప్రభాస్- అనుష్క మూడు మూళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారని చాలా సార్లు విన్నాం. అయితే ఈ ఇష్యూపై ప్రభాస్ పెద్దమ్మ, రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు సతీమణి శ్యామల దేవి రియాక్ట్ అవుతూ ప్రభాస్- అనుష్కల పెళ్లి జరగదని, వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ తప్పితే వాళ్ళ మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పారు. మరోవైపు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి ఏదోలా దాటేస్తూ వస్తున్నారు ప్రభాస్.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది