Chiranjeevi : ఆయన వలన బుద్ధి గడ్డి తిని చిరంజీవి తల్లిని తిట్టాను.. ఇప్పుడు బుద్ధి వచ్చిందంటూ క్షమాపణలు తెలిపిన శ్రీ రెడ్డి
Chiranjeevi : ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే అక్కడ శ్రీ రెడ్డి ఉంటుంది. నిత్యం వార్తలలో నిలిచేందుకు ఈ అమ్మడు చేసే సంచలన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. సమంత, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని ఇలా టాలీవుడ్ ప్రముఖులపై నోరు పారేసుకున్న శ్రీ రెడ్డి ఒకానొక సందర్భంలో చిరంజీవి తల్లి అంజనా దేవిని కూడా విమర్శించింది. టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు నచ్చక శ్రీరెడ్డి.. ఆయనపై విరుచుకుపడింది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ తల్లిని తీవ్ర పదజాలంతో దూషించింది శ్రీరెడ్డి.
ఉద్యమం తీవ్రతరం అవ్వాలంటే.. పవన్ కళ్యాణ్‌ని అతని తల్లిని తిట్టమని వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మే తనకి సలహా ఇచ్చాడంటూ అప్పట్లో బాంబ్ పేల్చి అతని బండారం బయటపెట్టింది శ్రీరెడ్డి. చాలా రోజుల తర్వాత అకారణంగా చిరంజీవి తల్లిని తిట్టినందుకు పశ్చాత్తాప పడుతున్నానంటూ చాలా కాలం తరువాత క్షమాపణ చెప్పింది.అప్పట్లో ఓ పెద్ద మనిషి తనను బ్రెయిన్ వాష్ చేసి.. ఓ కారణం చెప్పి న్యాయం జరుగుతుందని తప్పు దోవ పట్టించాడని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి.

sri reddy apologize Chiranjeevi mother
Chiranjeevi : ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయిందా…
తనకు చిరంజీవి కుటుంబానికి మధ్య ఉన్న పర్సనల్ గొడవల్లోకి తనను లాగాడని.. ఆడవాళ్ల కోసం తాను చేసిన ఉద్యమంలో న్యాయం కోసం ఓ పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో చిరంజీవి గారి అమ్మ అంజనమ్మని తిట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ ఇష్యూ తర్వాత తన సొంత వాళ్లే తనను విమర్శించారని.. బయట నుంచి ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. రీసెంట్ గా అనారోగ్యం నుంచి కోలుకున్న శ్రీరెడ్డి.. హైదరాబాద్‌లో పెద్దమ్మ తల్లి టెంపుల్‌ని దర్శించుకున్నారు. ఈ సందర్భంలో అమ్మ వారి సాక్షిగా చిరంజీవి తల్లి అంజనా దేవికి క్షమాపణ చెప్పింది శ్రీరెడ్డి.