Sri Reddy : సమంత-నాగచైతన్య విడాకులపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్..!
Sri Reddy : అక్కినేని నాగచైతన్య-సమంత డైవోర్స్ మ్యాటర్ గత కొద్ది రోజుల నుంచి చర్చనీయాంశంగా ఉంది. అయితే, ఈ విషయమై సమంత స్పందించింది. కానీ, క్లారిటీ అయితే ఇవ్వలేదు. తాను హైదరాబాద్‌లోనే ఉంటానని, హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. కానీ, నాగచైతన్యతో విడాకుల గురించి సామ్ స్పష్టంగా చెప్పలేదు. ఈ విషయం అక్టోబర్ 7న చై-సామ్ పెళ్లి రోజున తేలనుందని అభిమానులు, నెటిజన్లు పేర్కొంటున్నారు. కాగా, చైతన్య-సమంత విడాకుల విషయమై నటి శ్రీరెడ్డి స్పందించింది.
సమంత-చైతన్య విడాకులు విషయం తెలుసుకుని తమిళనాడులో చాలా మంది బాధపడుతున్నారని శ్రీరెడ్డి తెలిపింది. తమిళనాడులోని సినీ అభిమానులు సమంతను తిడుతున్నారని చెప్పింది. ఇకపోతే తాను సమంత-చైతన్య కలిసి ఉండాలని కోరుకుంటున్నానని శ్రీరెడ్డి పేర్కొంది. ఈ క్రమంలోనే జీవితం గురించి పలు విషయాలు చెప్పింది. జీవితం అనేది చాలా అడ్జస్ట్‌మెంట్స్‌తో కూడినదని, ప్రతీ ఒక్కరు ఈ అడ్జస్ట్ మెంట్స్ చేసుకుంటేనే లైఫ్‌లో ముందుకు సాగొచ్చని తెలిపింది. మ్యారేజ్ తర్వాత సామ్ డ్రెస్సింగ్ స్టైల్ విషయమై చాలా మందికి నచ్చలేదని, అక్కినేని వారి ఫ్యామిలీకి నచ్చకపోయి ఉండొచ్చని అభిప్రాయపడింది.
Sri Reddy : జీవితంలో అడ్జస్ట్‌మెంట్స్ అవసరం..
ఈ క్రమంలోనే మనం ఎక్కడ ఉంటే అక్కడి పరిస్థితులకు తగ్గట్టు ఉండాలని, భారతీయ సంస్కృతిని గౌరవించి ఇక్కడి పరిసరాలకు తగ్గట్లు బట్టలు ధరించాలని కోరింది. చాలా మందికి ఇన్‌స్పైరింగ్ కపుల్‌గా సమంత-చైతన్య ఉండాలని, ఉంటారని తాను ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా శ్రీరెడ్డి నాగచైతన్యను అన్నయ్య అని, సమంతను వదిన అని సంబోధించింది. నాగచైతన్య-సమంత కలిసి ఉండాలనేది తను ఆశిస్తున్నట్లు తెలిపింది. రోమ్‌లో ఉన్నపుడు రోమన్‌లా ఉండాలని, అలాగే భారతదేశంలో ఉన్నపుడు భారతీయుల్లా ఉండాలని, ఇక్కడి సంస్కృతిని గౌరవించి, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు క్లోతింగ్స్ ఉండాలని చెప్పింది.
హాలీవుడ్ మోడల్స్, యాక్ట్రెసెస్ మాదిరిగా బట్టలు ధరించడం ఇక్కడ కుదరబోదని, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు బట్టలు ధరించాలని చెప్పింది. నాగచైతన్య అన్నయ్య కూడా లైఫ్‌లో అడ్జస్ట్ కావాలని సూచించింది. సమంత బిజినెస్ ఉమన్‌గా, యాక్ట్రెస్‌గా ముందుకు సాగాలని సూచించింది. ఇకపోతే సంసారంలో ఇబ్బందులు సహజమని, సరిగమ పదనిసలా సమస్యలు ఉంటాయని వాటిని సార్ట్ ఔట్ చేసుకోవలని, కలిసి మెలిసి ఉండాలని సూచించింది. ఇది తన రిక్వెస్ట్ అని చెప్పింది.