Sri Reddy : ఎప్పుడు బూతుల‌తో విరుచుకు ప‌డే శ్రీ రెడ్డి బంగారు చేప పులుసు పెట్టి పిచ్చెంక్కించింది.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sri Reddy : ఎప్పుడు బూతుల‌తో విరుచుకు ప‌డే శ్రీ రెడ్డి బంగారు చేప పులుసు పెట్టి పిచ్చెంక్కించింది.. వీడియో !

 Authored By sandeep | The Telugu News | Updated on :12 March 2022,6:00 pm

Sri Reddy : సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన ఐటెం బాంబ్ శ్రీ రెడ్డి. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేసి దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించిన ఆమె ప్రస్తుతం అటు సినిమా, ఇటు పాలిటిక్స్ రెండు రంగాలపై కామెంట్స్ చేస్తుండటం చూస్తున్నాం. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇష్ట‌మొచ్చిన‌ట్టు కామెంట్స్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది శ్రీ రెడ్డి. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి.. ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ వంటి వాటిలో నటించి సినిమాలకు దూరమైంది.

ప‌వన్ క‌ళ్యాణ్‌పై ఎక్కువ‌గా నెగెటివ్ కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లో నిలిచే ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. భీమ్లా నాయక్ ట్రైలర్ అనుకున్నంతగా లేదు అంటూ ఈ ట్రైలర్ యావరేజ్ గా ఉంది అని సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాకుండా బిల్లా నాయక్ ట్రైలర్ అని ట్వీట్ చేసిన శ్రీరెడ్డి పక్కనే నవ్వుతున్న ఎమోజీ లను కూడా పోస్ట్ చేసింది. మూవీ రిలీజ్ అయ్యాక కూడా శ్రీ రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్స్ చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా పల్లెటూరి వంటలతో ఘుమఘుమలాడిస్తోంది.

sri reddy prepares fish soup

sri reddy prepares fish soup

Sri Reddy : ఘుమ‌ఘుమ‌ల‌కు పిచ్చెక్కిపోతున్నారుగా..

పీతలు, రొయ్యలు, ఎండుచేపలు ఇలా రోజుకో వంటతో పల్లెటూరి రుచుల్ని తనదైన శైలిలో చూపిస్తోంది. నాటు స్టైల్‌లో వంటలు వండుతూ.. తూర్పుగోదావరి యాసలో అన్ని రుచుల్ని చూపిస్తోంది శ్రీరెడ్డి. తాజాగా చెరువులో పట్టిన బంగారుతీగ చేప పులుసు చేసింది. అందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ ర‌చ్చ చేసింది. శ్రీ రెడ్డి వీడియో వైర‌ల్‌గా మారింది. శ్రీరెడ్డి సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానెళ్ల డిబెట్లు, ఇంటర్వ్యూల్లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చింది. అంతేకాదు, రాజకీయ నాయకులను సైతం వదలి పెట్టలేదు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది