Sridevi Drama Company : మార్కులు కొట్టేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ.. హ్యాట్సాఫ్ అంటోన్న నెటిజన్లు
Sridevi Drama Company: ప్రస్తుతం జబర్ధస్త్ తర్వాత బుల్లితెరపై సందడి చేస్తున్న టీవీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రతి ఆదివారం సందడి చేయనున్న ఈ షోలో ఫన్ మాములుగా ఉండదు. ఇందులో కామెడీతో పాటు సాంగ్స్, డ్యాన్స్ ఇలా ప్రతీది కూడా ప్రేక్షకులకి వినోదం పంచుతుంది. అయితే మహిళా దినోత్సవం స్పెషల్ ఎపిసోడ్‌గాఈ కార్యక్రమం మొత్తం ఆడవాళ్లతో సరదాగా సాగింది. కంటెస్టెంట్స్ తల్లులు, అక్కలతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా షోలో పాల్గొని సందడి చేశారు. అయితే ఈ షో చాలా ఎమోషనల్‌గా సాగడమే కాక మహిళలకు సంబంధించి పలు స్కిట్స్‌తో అలరించిన కారణంగా ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది.
దీనిపై నెటిజన్స్ స్టన్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు. హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.తాజాగా విడుదలైన ప్రోమోలో వర్ష, ఇమ్మాన్యుయేల్ ట్రాక్ బాగుంది. కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తల్లి వేదిక పైకి వచ్చారు.వేదికపైకి రాగానే ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారని అడగగా వెంటనే తన తల్లి కోడలిని ఎప్పుడు తీసుకువస్తావు అని అడుగుతున్నారు అంటూ సమాధానం చెబుతుంది. మరి నువ్వేం చెప్పావని ఇమ్మాన్యుయేల్ అడగగా నువ్వు క్లారిటీ ఇస్తే కదా వర్ష అమ్మాయా? కాదా? అని పంచ్ వేస్తూ వర్ష పరువు మొత్తం తీసింది.

sridevi drama company gets positive response
Sridevi Drama Company : కిక్ మామలుగా లేదు..
అలాగే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు వారి బిడ్డల తలపై చేత్తో ఇలా అంటారు.నువ్వు ఎందుకు ఎప్పుడూ నా తలపై అలా అనవు అంటూ ఇమ్మాన్యుయేల్ అడగగా అందుకు తన తల్లి మాట్లాడుతూ నేను కూడా అలా అంటే ఉన్న నాలుగు కూడా ఎక్కడ ఊడిపోతాయో అంటూ తన బట్టతల గురించి మరో పంచ్ వేశారు.ఇలా ఇమ్మాన్యుయేల్ తల్లి వరుసగా సెటైర్లు వేయడంతో ఈ ప్రోమో ఎంతో సరదాగా సాగిపోయింది.ఇక వర్షని నరేష్ కూడా ఆడుకున్నాడు. ఎంతో సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచనుంది.