Sridevi Drama Company : బాబోయ్.. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ ‘డ్రామా’ లు ఎక్కువ అయ్యాయి!
Sridevi Drama Company : ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ వ్యవహారం రోజు రోజుకీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కంటెస్టెంట్స్ యొక్క ఓవరాక్షన్ ఒకసారి వార్తల్లో నిలిస్తే.. మరోసారి వివాదాస్పద పంచ్ లు మరియు కామెడీ మరోసారి వార్తల్లో నిలుస్తున్నాయి. ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీ వార్తల్లో నిలవడానికి కారణం రెగ్యులర్ గా ఎపిసోడ్ లో ఏదో ఒక ఏడుపు గొట్టు స్కిట్ పెడుతున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ నవ్వించడంతో పాటు ఏడిపిస్తుంది అంటూ మొదట్లో మంచి మార్కులు పడ్డాయి.. కానీ ఇప్పుడు ప్రతి వారం ఏదో ఒక టాపిక్ తీసుకొని ఏడిపించడం అనేది బాగాలేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.
గతవారం నరేష్ లవ్ ఫెయిల్యూర్ కి సంబంధించిన ఒక డాన్స్ స్కిట్ చేసి ప్రేక్షకులను మరియు అక్కడున్న వారందరినీ కూడా ఏడిపించారు, ఇక ఈ వారం పంచ్ ప్రసాద్ యొక్క లవ్ స్టోరీ ని చూపిస్తూ అలాగే హైపర్ ఆది తన పదవ తరగతి లవ్ లెటర్ ని చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రేక్షకులు ఈసారి కూడా కన్నీళ్లు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ప్రతి వారం ఏదో ఒక డ్రామా చేస్తూ నవ్వించే బదులు ఏడిపిస్తూ ఉంటే బాగాలేదు తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని తాము అంతా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నామని.. ఇలా ప్రతివారం ఏడుపు గొట్టు సన్నివేశాలను చూపించాలనుకుంటే అందుకు మరో కార్యక్రమాన్ని నిర్వహించాలని వాటిని చూడాలనుకున్నవారు.
వాటిని ఎంటర్టైన్మెంట్ కోరుకున్న వారు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని చూస్తారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా ఇలాంటి ఏడిపించే కార్యక్రమాలను తీసుకు రావద్దని మల్లెమాల వారికి మరియు ఈటీవీ వారికి ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ తగ్గుతుంది అంటూ గుసగుసలు వస్తున్నాయి. ఇదే కంటిన్యూ అయితే రాబోయే వారాల్లో కచ్చితంగా రేటింగ్ భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది. మల్లెమాల మరియు ఈటీవీ పూర్తిగా జబర్దస్త్ ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలపై మాత్రమే ఆధారపడి ముందుకు సాగుతున్నాయి. ఈ సందర్భంగా జబర్దస్త్ ఒక మోస్తరుగా రేటింగ్ దక్కించుకుంటూ దూసుకు పోతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రం ప్రారంభించినప్పటి నుండి అంతంత మాత్రంగా రేటింగ్ దక్కించుకున్న లాభాలు వస్తున్నట్లుగా మల్లెమాల వారు చెబుతున్నారు. కనుక ఆ కార్యక్రమాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది. అందుకే ఏడిపించే విధంగా కార్యక్రమాలను నిర్వహించకుంటే మంచిది.