Sridevi Drama Company : నవ్విస్తారు,ఏడిపిస్తారు.. ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీ హిట్ కి కారణం
Sridevi Drama Company : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో స్థాయిలో మరే కామెడీ షో కూడా రాదని అంతా భావించారు. ఇప్పటి వరకు పలు చానల్లో కామెడీ షోలు ఎన్నో వచ్చాయి. కానీ జబర్దస్త్ షో స్థాయి లో ఉన్న కామెడీ షో ఒక్కటి కూడా రాలేకపోయింది. జబర్దస్త్ షో కి పోటీ అంటే ఆ చానల్ లోనే ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అని మెల్ల మెల్లగా నిరూపితం అవుతోంది. జబర్దస్త్ షో రేంజ్ లో కాకున్నా ఆ రేంజ్ వినోదాన్ని పండిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ వారం వారం అత్యధిక రేటింగ్ తో దూసుకు పోతూనే ఉంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో వచ్చే షోలకు ఎక్కువగా టిఆర్పి రేటింగ్ ఉండదనే అభిప్రాయం ఉంది. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కి మాత్రం అనూహ్యంగా భారీ రేటింగ్ దక్కుతోంది.
రేటింగ్ మాత్రమే కాకుండా యూట్యూబ్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క వీడియోలకు పదుల మిలియన్ ల వ్యూస్ లభిస్తున్నాయి. ఇంతటి ఆదరణ దక్కించుకోవడానికి కారణం సుధీర్ యాంకరింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాకుండా ఈ షోలో నవ్వించడం మాత్రమే కాకుండా డాన్స్ తో మెప్పించడం సెంటిమెంట్ తో కన్నీళ్లు పెట్టించిన కూడా చేస్తున్నారు. అందుకే ఈ షో ఇంతటి సక్సెస్ అయింది. ప్రతి ఎపిసోడ్ లో కూడా కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆది మరియు రాంప్రసాద్ లు వేసే పంచ్ లు ఇతర కమెడియన్స్ హంగామా మరియు ఇంద్రజ యొక్క హుందాతనంతో శ్రీదేవి డ్రామా కంపెనీ రేంజ్ ఎక్కడికో వెళ్తుంది.

sridevi drama company success reason comedy and tragedysridevi drama company success reason comedy and tragedy
ఇటీవల వచ్చిన యోధ యొక్క ఒనీల ఫంక్షన్ గాని ఆ తర్వాత వచ్చిన వాలెంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కానీ ప్రతి దాంట్లో కూడా ప్రేక్షకులను తెలియకుండానే కన్నీళ్లు పెట్టించే ఈ సన్నివేశాలు చాలా ఉన్నాయి. అందుకే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ హిట్ అయింది అనడంలో సందేహం లేదు. ప్రతి ఎపిసోడ్ లో నవ్వించడం మాత్రమే పనిగా పెట్టుకోకుండా సెంటిమెంట్ తో గుండెలు పిండేయాలి అనే కాన్సెప్ట్ ను తీసుకున్న ప్రోగ్రాం ప్రొడ్యూసర్స్ ను ఎంతగా అభినందించినా తక్కువే. ఇలాగే నవ్విస్తూ ఏడిపిస్తూ డ్యాన్స్ లతో ఎంటర్టైన్మెంట్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ షో రేంటింగ్ లో జబర్దస్త్ ని బీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.