Sruthi Hassan : శాంతనుతో ప్రేమ ఎప్పుడు పుట్టిందో చెప్పిన శృతి హాసన్
Sruthi Hassan : కమల్ గారాల పట్టి శృతి హాసన్ ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సులే అనే అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయిన శృతి హాసన్ ఇక అతనినే పెళ్లి చేసుకుంటుందని, సినిమాలకు సైతం దూరం అయిపోతుంది అని అందరూ భావించారు. దానికి ఊతం ఇచ్చే విధంగా ఆమె అతనిని ఇండియా తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు సైతం పరిచయం చేసింది. పెళ్లి చేసుకోవడం పక్కా అనుకున్న సమయంలో గుడ్ బై చెప్పింది. ఇక కొద్ది రోజులుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో తెగ రచ్చ చేస్తుంది.ఇటీవల శ్రుతి హాసన్.. ఆమె ప్రియుడు శాంతను హజరికా కలిసి ఓ వీడియో చేశారు.
అందులో అడుగుతున్న ప్రశ్నలకు వారిద్దరూ సైగలతోనే సమాధానం చెప్పారు. ఆ క్రమంలో శ్రుతి తన ప్రేమ విషయాన్ని బట్టబయలు చేసింది. ముందుగా మీలో ఎవరు మరొకరిని ఇష్టపడ్డారు అని అడగ్గా.. శాంతను తనే అనట్లు వేలిని తన వైపు చూపించుకున్నారు. ఇక ముందుగా ఎవరు ముందుగా ఐ లవ్ యు చెప్పారు? అని ప్రశ్నిస్తే శ్రుతి నేనే అన్నట్లు సైగ చేసింది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రొటెక్టివ్‌గా ఉంటారు? అని అడిగితే, ఇద్దరూ ఒకరినొకరు సైగలతో చూపించుకున్నారు.ఇప్పుడు శాంతను, శృతి హాసన్ ప్రేమలో ఉన్నారని తెలుస్తుండగా, వీరిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారు?

sruthi hassan reveals about love story
Sruthi Hassan : శాంతనుతో ప్రేమలో ఎప్పుడు పడింది..!
ఎప్పుడు కలిశారు? అంటే…2020 ప్రారంభంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. మందిరా బేడీ టాక్ షో ‘ద లవ్ లాఫ్ లివ్’లో తొలిసారి శాంతనుతో ప్రేమ విషయం గురించి శ్రుతీ హాసన్ ఓపెన్ అయ్యారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అభిమాని “మీరు శాంతనును ఎప్పుడు కలిశారు?” అని ప్రశ్నించగా… “శాంతను గురించి 2018లో తెలుసు. 2020 బిగినింగ్ లో కలిశాం” అని శ్రుతీ హాసన్ చెప్పారు. రీ ఎంట్రీలో క్రాక్ చిత్రంతో మంచి హిట్ కొట్టిన శృతి హాసన్ ఇప్పుడు సలార్ అనే చిత్రంతో పాటు పలు సినిమాలు చేస్తుంది.
View this post on Instagram