SS Rajamouli : రామ్ చరణ్ కి రాజమౌళి స్వీట్ వార్నింగ్.. నా పర్మిషన్ లేనిదే అలా చేయొద్దు..!
ప్రధానాంశాలు:
SS Rajamouli : రామ్ చరణ్ కి రాజమౌళి స్వీట్ వార్నింగ్.. నా పర్మిషన్ లేనిదే అలా చేయొద్దు..!
SS Rajamouli : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. సౌత్ ఇండియా పాపులర్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ Game Changer Trailer రిలీజ్ ఈవెంట్ కి దర్శక ధీరుడు S.S. రాజమౌళి గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్ లో భాగంగా రాజమౌళి రామ్ చరణ్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ లో రామ్ చరణ్ Ram Charan గుర్రం మీద స్వారి చేసే షాట్ ఒకటి ఉంది. అది చూసిన రాజమౌళి S.S. Rajamouli చరణ్ తో గుర్రం మీద స్వారి చేయడం అన్నది నా పర్మిషన్ లేకుండా చేయొద్దు దాని సర్వ హక్కులు నావే అవసరమైతే పేపర్లతో అగ్రిమెంట్ చేసుకుందామని రామ్ చరణ్ తో సరదాగా అన్నారు రాజమౌళి. చరణ్ జక్కన్న కాంబోలో వచ్చిన మగధీర సినిమాలో గుర్రం సీన్స్ ఉన్నాయి.
SS Rajamouli గుర్రం మీద స్వారి చేస్తుంటే..
రెండేళ్ల క్రితం వచ్చిన RRR సినిమాలో కూడా రాం చరణ్ కి గుర్రం సీన్స్ పెట్టాడు S.S. రాజమౌళి. చరణ్ అలా గుర్రం మీద స్వారి చేస్తుంటే మెగా ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే. రామ్ చరణ్ హార్స్ రైడింగ్ సీన్స్ తెర మీద అద్భుతంగా చూపిస్తారు. ఐతే గేమ్ ఛేంజర్ లో డైరెక్టర్ శంకర్ కూడా అలాంటి సీన్స్ ప్లాన్ చేయగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఇంకోసారి ఆ షాట్స్ చేయాలంటే నా పర్మిషన్ తీసుకోవాలని రామ్ చరణ్ కి సరదాగా చెప్పారు రాజమౌళి.
ఇక గేమ్ ఛేంజర్ ట్రైలర్ తో శంకర్ Shankar తిరిగి ఫాంలోకి వచ్చినట్టే అనిపిస్తుంది. జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ కియరా అద్వాని Kiara Advaniహీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా తెలుగు హీరోయిన్ అంజలి కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసింది. SS Rajamouli , Ram Charan, Game Changer, Game Changer Trailer, Kiara Advani, Shankar