SS Rajamouli : హాలీవుడ్ లెజెండరీ స్టీవెన్ స్పీల్‌బెర్గ్ తో … ఎస్ఎస్ రాజమౌళి ఫోటో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SS Rajamouli : హాలీవుడ్ లెజెండరీ స్టీవెన్ స్పీల్‌బెర్గ్ తో … ఎస్ఎస్ రాజమౌళి ఫోటో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :14 January 2023,8:00 pm

SS Rajamouli : హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టీవెన్ స్పీల్‌బెర్గ్ ప్రపంచ సినిమా రంగంలోనే సుప్రసిద్ధ సినీదర్శకుడు, రచయిత, నిర్మాత. హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఆయనతో సినిమాలు చేయాలని అనుకుంటారు. అటువంటి లెజెండరీ అయిన స్టీవెన్ స్పీల్‌బెర్గ్ నీ ఎస్ఎస్ రాజమౌళి కలవడం జరిగింది. ఒక్కసారిగా ఆశ్చర్యపడీ స్టీవెన్ స్పీల్‌బెర్గ్ నీ అదే పనిగా చూస్తూ జక్కన్న దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఎంఎం కీరవాణి కూడా ఫోటో దిగటం జరిగింది.

స్టీవెన్ స్పీల్‌బెర్గ్, రాజమౌళి, కీరవాణి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “RRR” సినిమా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “నాటు నాటు” పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం జరిగింది. ఇక ఆస్కార్ అవార్డు కూడా వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతకు ముందు న్యూయార్క్ సినీ క్రిటిక్ .. అవార్డు రాజమౌళి దక్కించుకున్నాడు. ఈ రీతిగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు

ss rajamoulis photo with hollywood legend steven spielberg is viral

ss rajamoulis photo with hollywood legend steven spielberg is viral

“RRR” సొంతం చేసుకుంటూ పోతుంది. ఈ కోవాలోనే ఆస్కార్ అవార్డు కూడా “RRR”కి రావాలని భారతదేశంలో ఉన్న సినీ ప్రముఖుల కోసం సినిమా లవర్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం “RRR” సినిమా యూనిట్ అమెరికాలో ఉంది. అంతర్జాతీయంగా భారతీయ చలనచిత్రపరంగా రాజమౌళి పేరు మారు మ్రోగుతూ ఉండటంతో … చాలామంది హాలీవుడ్ ప్రముఖులు కలుస్తూ ఉన్నారు. ఈ దిశగానే హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన లెజెండరీ స్టీవెన్ స్పీల్‌బెర్గ్ … జక్కన్నతో కలవడం విశేషం.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది