Star Hero : పగలంతా సినిమా లు రాత్రి పూట బూతు పనులు.. సిగ్గు లేకుండా ఛి ఛీ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Star Hero : పగలంతా సినిమా లు రాత్రి పూట బూతు పనులు.. సిగ్గు లేకుండా ఛి ఛీ..!!

Star Hero : సెల‌బ్రిటీల ముసుగులో కొంద‌రు చేసే వికృత చేష్ట‌లు అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి.అయితే సినిమాలో హీరోగా నటించిన యువకుడు అతని అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హీరోగా మంచి భవిష్యత్తు ఉంటుందని కొందరు చెప్పడంతో సినిమా సబ్జెక్ట్ నచ్చలేదని కొన్ని కథలను రిజక్ట్ చేసిన చరిత్ర కూడా ఉంది. అయితే రీసెంట్‌గా హైటెక్ వేశ్యవాటిక కేంద్రాల మీద పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చెయ్యడంతో అరెస్టు అయిన వారిలో సినిమా హీరో ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 January 2023,1:40 pm

Star Hero : సెల‌బ్రిటీల ముసుగులో కొంద‌రు చేసే వికృత చేష్ట‌లు అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి.అయితే సినిమాలో హీరోగా నటించిన యువకుడు అతని అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హీరోగా మంచి భవిష్యత్తు ఉంటుందని కొందరు చెప్పడంతో సినిమా సబ్జెక్ట్ నచ్చలేదని కొన్ని కథలను రిజక్ట్ చేసిన చరిత్ర కూడా ఉంది. అయితే రీసెంట్‌గా హైటెక్ వేశ్యవాటిక కేంద్రాల మీద పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చెయ్యడంతో అరెస్టు అయిన వారిలో సినిమా హీరో ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అరెస్టు అయిన ఆరు మందిలో శాండిల్ వుడ్ హీరో మంజునాథ్ అలియాస్

సంజు అలియాస్ యువ అనే హీరో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపుతుంది.మూడేళ్ల క్రితం విడుదలైన ‘న్యూరాన్‌’ అనే సైక్లాజికల్ త్రిల్లర్ మూవీలో మంజునాథ్ హీరోగా నటించాడు. ప్రస్తుతం ఈ నటుడు అనేక బిజినెస్ లు చేస్తూ కర్ణాటకలో పెద్ద మనిషిలా చలామణి అవుతూ బంగ్లాదేశ్ నుంచి బెంగళూరుకి అక్రమంగా అమ్మాయిలను తీసుకు వచ్చి బలవంతపు వ్యభిచారం చేయిస్తున్నాడు. బెంగళూరు నగరంలోని కెంగేరి డెంటల్ కాలేజీ సమీపంలో ఒక అద్దె ఇంటిలో ఈ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు తెలుసుకొని దాడులు నిర్వహించి కెంగేరిలోని వినాయకనగర్,

Star Hero manjunath alias sanju arrested

Star Hero manjunath alias sanju arrested

బాదరహళ్లి ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకోగా,ఈ దాడిలో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితులను విచారించగా అస‌లు సూత్ర‌ధారి మంజునాథ్ అని తెలిసింది. ‘లోకాంటో’ అనే యాప్ ద్వారా వీరు హైటెక్ వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు స్ప‌ష్టం చేశారు.వారికి ఇక్క‌డ‌ పని ఇప్పిస్తాను అంటూ బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి ఇక్కడ బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్లు సీసీబీ పోలీసులు తెలియ‌జేశారు. ఆయ‌న దగ్గ‌ర నుండి నాలుగు మొబైల్ ఫోన్లు, బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లు, భారతీయ నగదు స్వాధీనం చేసుకొని కేసు విష‌యంలో దర్యాప్తు చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది