Shruti Haasan : డైరెక్ట్ గా అతనికి మిడిల్ ఫింగర్ చూపించిన శృతిహాసన్… ఎవరిని ఉద్దేశించి అంటే…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 15, 2022, 1:00 pm

Shruti Haasan : విదేశాలలో ఎక్కువగా మిడిల్ ఫింగర్ చూపించడం పెద్ద బూతుగా పరిగణిస్తారు. ఇక దానిని వేరీ అగ్రెసివ్ మరియు అబ్యూస్ బాడీ లాంగ్వేజ్ గా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ దిగిన ఫోటో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో శృతిహాసన్ ఎవరునో తిడుతున్నారు ? ఎవరికో ఐ డోంట్ కేర్ అని చెబుతున్నారని సందేహాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం శృతిహాసన్ పై రూమర్ నెట్టింటా హల్చల్ చేస్తుంది. అయితే శృతిహాసన్ లవర్ శాంతను హజారికతో విడిపోయారంటూ వార్తలు వెలువడుతున్నాయి. అయితే శృతిహాసన్ రెండేళ్ల నుంచి ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ ,శాంతన్ హజారికతో సహజీవనం చేస్తున్నారట. ఇక వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని సమాచారం. ఇక వీరి మధ్య ఉన్న రిలేషన్ అందరికీ తెలిసిందే.

ఎందుకంటే శృతిహాసన్ తన పర్సనల్ లైఫ్ విషయాలను ఎక్కడ దాచుకోదు. ఇక ఎప్పటికప్పుడు శృతిహాసన్ శాంతన్ తో తన హ్యాపీ మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడూ తాను ప్రేమించుకుంటున్నట్లు కలిసి జీవిస్తున్నట్లు మాత్రం చెప్పలేదు. ఫోటోలు చూసి మీరే అర్థం చేసుకోండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అతనిని తన తండ్రి కమల్ హసన్ కి కూడా పరిచయం చేసిందట. అలాగే ఓ బర్త్డే పార్టీలో శృతి కుటుంబంతో , పాటు శాంతన్ కూడా పాల్గొన్నారట. అయితే గత కొద్దిరోజులుగా శృతిహాసన్ మరియు శాంతన్ ఒకటిగా కనిపించడం లేదు. వీరిద్దరు దిగిన ఫోటోలు షేర్ చేసి చాలా రోజులు అవుతుంది. అదే సమయంలో తాను ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలుు షేర్ చేస్తుంది శృతి. అయితే ఇటీవల నన్ను నేను ప్రేమించుకోవడం,

Star heroine Shruti Haasan showing a middle finger

Star heroine Shruti Haasan showing a middle finger

నా విలువైన సమయాన్ని నాకోసమే వాడుకోవడం, ఎంతో ముఖ్యమని నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఒంటరితనాన్ని ఆనందిస్తున్నానంటూ శృతిహాసన్ పెట్టిన పోస్ట్ చూసి ప్రియుడుతో విడిపోయారని అందరూ అనుకుంటున్నారు. తన కొత్త ప్రియుడుతో కూడా గుడ్ నైట్ చెప్పేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు పై శృతి మాత్రం స్పందించలేదు. అసలు శాంతన్ తన లవర్ అని చెప్పని శృతిహాసన్ వారు బ్రేకప్ ను మాత్రం ఎలా చెబుతుంది అంటూ కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల శృతిహాసన్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతుంది. బ్రేకప్ అంటూ మీడియా వాళ్ళు రాస్తున్న రూమర్స్ కు అలా వార్నింగ్ ఇచ్చిందా లేక విడిపోయిన శాంతను కు తన స్టైల్ లో సమాధానం చెప్పిందా అనే సందేహం అందరిలో మొదలైంది. ఇది ఇలా ఉండగా శృతి ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్నట్లుగా సమాచారం. వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్లో భాగంగా ఆమె అక్కడికి వెళ్లినట్లుగా తెలుస్తుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp