Sudigali Sudheer : రింగ్ తొడిగిన సుడిగాలి సుధీర్.. ఆ అమ్మాయితో నిశ్చితార్థం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : రింగ్ తొడిగిన సుడిగాలి సుధీర్.. ఆ అమ్మాయితో నిశ్చితార్థం..!

 Authored By sandeep | The Telugu News | Updated on :3 March 2022,5:30 pm

Sudigali Sudheer : జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ చేసే సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆయ‌న‌ టీమ్ కి మంచి పేరుంది. సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనుతో కూడిన ఈ టీమ్ నాన్ స్టాప్ కామెడీ పంచుతున్నారు. దీనితో ఈ త్రయం చాలా ఫేమస్ అయ్యారు. ఇక మల్టీ టాలెంటెడ్ అయిన సుధీర్… మరింతగా ఫేమ్ రాబట్టి బుల్లితెర స్టార్ గా ఎదిగాడు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, పోవే పోరా వంటి షోలలో యాంకర్ గా కూడా చేస్తున్నారు. ఒక‌వైపు బుల్లితెర‌పై సంద‌డి చేస్తూనే మ‌రోవైపు వెండితెర‌పై కూడా అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటించాడు. అలాగే హీరోగానూ మారి ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘త్రీమంకీస్’ అనే సినిమాలు చేశాడు. ఇక, ఇప్పుడు సుధీర్ ‘కాలింగ్ సహస్రా’, ‘గాలోడు’ అనే సినిమాల్లో నటిస్తున్నాడు.

sudigali sudheer engagement in sridevi drama company

sudigali sudheer engagement in sridevi drama company

తెలుగు బుల్లితెరపై రొమాంటిక్ క‌పుల్ అన‌గానే.. అందరికీ సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ పేర్లు వెంటనే గుర్తొస్తాయి. బుల్లితెర‌పై వారిద్ద‌రిని షారూక్- కాజ‌ల్ జోడీగా అభివ‌ర్ణిస్తూ ఉంటారు. వాళ్లతో ప్రోగ్రామ్స్ చేయడానికి ఛానెల్స్ కూడా పోటీ పడుతుంటాయి. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీ కూడా వీరిద్ద‌రితో ఇప్ప‌టికే చాలా షోలు చేసి విజ‌యం సాధించింది. ర‌ష్మిని త‌న ల‌క్కీ ప‌ర్స‌న్‌గా చెప్పుకొనే సుధీర్.. ఆమెపై చాలాసార్లే ప్రేమ‌ను చూపించాడు. కానీ వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న సంబంధం ఏంట‌న్నది ఇప్ప‌టికీ స‌స్పెన్‌. రీల్ లైఫ్‌లో వీరిద్ద‌రికి చాలా సార్లు పెళ్లి కూడా జ‌రిగింది.

Sudigali Sudheer : ఇది రీల్ వేడుక‌నా, లేక రియల్ వేడుక‌నా ?

అయితే ఇప్పుడు సుధీర్‌కి వేరు అమ్మాయితో నిశ్చితార్థం జ‌రిగింది.ఆ అమ్మాయి ఇండ‌స్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాక‌పోవ‌డంతో జ‌నాల‌లో అనుమానాలు త‌లెత్తుతున్నాయి. గ‌తంలో చాలా సార్లు ఇలానే మోసంచేసిన నిర్వాహ‌కులు మ‌ళ్లీ అలాంటి డ్రామానే ఆడుతున్నారేమోన‌న్న అభిప్రాయానికి వ‌స్తున్నారు. మరికొందరేమో ఈ అమ్మాయే..సుడిగాలి సుధీర్‌కు కాబోయే భార్య అని అభిప్రాయపడుతున్నారు. ఈ నిశ్చాతార్థ వేడుక ద్వారా తన ప్రేయసిని సుధీర్ పరిచయం చేస్తున్నాడని చెబుతున్నారు. మ‌రి ఇందులో క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది