Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. ఈపేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హోస్ట్‌గా, కమడీయన్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు సుధీర్. ఆయనకు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన సుధీర్.. ఇప్పుడు గాలోడు చిత్రంతో వెండితెరపై సందడి చేశాడు. ఈ చిత్రంతో సుడిగాలి సుధీర్ ఎట్టకేలకు మాస్ హిట్ కొట్టేశాడు. మాస్ హీరోగా నిలదొక్కుకోవాలని సుధీర్ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. బుల్లితెరపై స్టార్‌గా తన సత్తా చాటుతూ వచ్చిన సుధీర్‌కు చివరకు ఓ మంచి మాస్ మసాలా సినిమా పడడంతో మనోడి రేంజ్ పీక్స్‌కి వెళ్లింది.
గాలోడు చిత్రం మాస్ ప్రేక్షకులకు విపరీతంగా ఎక్కేసినట్టుంది. మంచి కలెక్షన్స్ రావడంతో గాలోడు సినిమాప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అని అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు గాలోడు సినిమాకు సుధీర్ ఎంత తీసుకుని ఉంటాడనే చర్చ మొదలు కాగా, ఈ విషయం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే సుధీర్ ఈ సినిమా కోసం 50లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నాడనే ప్రచారం జరుగుతుంది. అయితే సినిమా మంచి సక్సెస్ కావడంతో సుధీర్ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో తాము ఎంతగా ఇబ్బంది పడ్డాడో వివరించాడు.
‘గాలోడు’ సినిమాలోని ‘నీ కళ్లే దీవాలి’ పాట షూటింగ్ కోసం లద్దాఖ్ వెళ్లామని అది భూమి కంటే 18 వేల అడుగుల ఎత్తులో ఉంటుందని తెలిపారు. పాంగ్యాంగ్ లేక్ దగ్గర షూట్ చేయగా, అక్కడ చాలా చల్లగా ఉంటుందని తెలిసి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా తీసుకెళ్లామని చెప్పాడు. ఇక మూవీ టీంలో కొందరు బ్రీతింగ్ విషయంలో ఇబ్బందిగా అనిపించడంతో పూర్తిగా పైవరకు రాలేకపోయారని సుధీర్ అన్నాడు. అక్కడ మైనస్ 20, 30 డిగ్రీల చల్లగా ఉంటుందని, ఊపిరి పీలుస్తుంటే మంచు లోపలికి వెళ్తుందని చెప్పాడు. ఇక డ్యాన్స్ చేసే సమయంలో ప్రతి షాట్ తర్వాత తన ముక్కు నుంచి రక్తం కారేదని.. దాన్ని తుడుచుకుని షూటింగ్ పూర్తి చేశామని సుధీర్ స్పష్టం చేశాడు.
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
This website uses cookies.