Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి ఆ అమ్మాయి తోనే ఫిక్స్
Sudigali Sudheer ; తాజాగా సోషల్ మీడియాలో బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. మనకు తెలిసిందే సుధీర్ కొన్ని సంవత్సరాల పాటు జబర్దస్త్ లో కమెడియన్ గా చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్ తోనే సినిమాలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ ను అందుకున్నాడు. గతేడాది వచ్చిన ‘ గాలోడు ‘ సినిమా సుడిగాలి సుదీర్ కు మంచి పేరును తీసుకొచ్చింది. దీంతో సుధీర్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతున్నాడు.ఇకపోతే సుడిగాలి సుధీర్ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే సుధీర్ వయసు 35 ఏళ్లు దాటింది. కెరీర్ లో కూడా సెటిల్ అయ్యాడు. ఇల్లు, కార్లు అన్ని సమకూర్చుకున్నాడు. ఇక పెళ్ళికి లేట్ ఏంటి అని సందేహం అందరిలో ఉంది. అయితే త్వరలోనే సుదీర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పేరెంట్స్ కోరిక మేరకు సుదీర్ పెళ్లికి ఒప్పుకున్నాడట. అమ్మాయిని కూడా నిర్ణయించారట. వరుసకు మరదలు అయ్యే చుట్టాలమ్మాయిని సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడట. అయితే సుధీర్ పెళ్లికి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి స్పష్టత రావాలంటే వేచి చూడాల్సిందే.
గతంలో కూడా ఎన్నోసార్లు సుదీర్ పెళ్లి అంటూ కథనాలు వెలువడ్డాయి. అవన్నీ పుకార్లు గానే మిగిలిపోయాయి. ఇక సుధీర్, యాంకర్ రష్మి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని ప్రచారం జరిగింది. వీరిద్దరూ ఏళ్ల తరబడి బుల్లితెరపై రొమాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో సుధీర్ రష్మీ పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని జనాలు భావిస్తున్నారు. అయితే మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే ప్రేమికులం కాదని రశ్మి సుధీర్ చాలా సార్లు చెప్పారు. సుధీర్ తో పాటు రష్మీ కూడా పెళ్లి చేసుకోవడం లేదు. సడన్గా ఏదో ఒక రోజు మా పెళ్లి అని షాక్ ఇస్తారేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.