Sudheer : హైపర్ ఆది ఇంట్లో త్రీ మంకీస్.. అది కావాలంటూ గోలపెట్టిన సుడిగాలి సుధీర్
Sudheer : బుల్లితెరపై,వెండితెరపై గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అయితే వెండితెరపై మాత్రం వీరి కాంబినేషన్‌కు సక్సెస్ అంతగా రాలేదు. కలిసి చేసిన సినిమా కూడా వర్కవుట్ అవ్వలేదు. త్రీ మంకీస్ అంటూ గెటప్ శ్రీను, సుధీర్, రామ్ ప్రసాద్ చేసిన సినిమా దారుణంగా బెడిసి కొట్టింది. అయితే తాజాగా ఈ ముగ్గురూ కలిసి హైపర్ ఆది ఇంటికి వెళ్లారు.
జబర్దస్త్ స్కిట్‌లో భాగంగా మొదటగా రాకెట్ రాఘవ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆయన కొడుకు మురారి పంచ్‌ల మీద పంచులు వేశాడు. కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చోవడంతో సుధీర్ షాక్ అవుతాడు. ఆ తరువాత ఆ ముగ్గురు హైపర్ ఆది ఇంటికి వెళ్లారు. సుధీర్ గ్యాంగును చూసిన హైపర్ ఆది డోర్ ఓపెన్ చేసి, ఆ గ్యాంగును చూసి వెంటనే డోర్ మూసేస్తాడు.

Sudigali Sudheer Team In Hyper Aadi Home
Sudhee : ఆది ఇంట్లో సుధీర్ రచ్చ
వాడేంటి? అలా డోర్ మూసేశాడు అంటే ఏదో ఉందని సుధీర్ తెగ ఆనందపడతాడు. ఏదో ఉందని ఇళ్లంతా వెదుకుతాడు. కానీ ఎవ్వరూ కనిపించరు. ఏం లేదు కదా? అని ఆదితో సుధీర్ అంటాడు. నేను కూడా అదే చెప్పాను.. ఏం లేదనే అన్నాను కదా? అని అంటాడు. ఏం లేదా? నాకు ఏదో ఒకటి కావాలని సుధీర్ అంటాడు. ఇక ఆది ఫుడ్ డెలివరీ గురించి మాట్లాడితే.. సుధీర్ మాత్రం ఇంకేదో అనుకుంటాడు. నేను చెప్పింది ఫుడ్ గురించి.. అంటూ సుధీర్ గాలి తీసేస్తాడు.\
