Sudigali Sudheer : జబర్దస్త్ రాఘవ ఇళ్లు చూస్తే షాక్.. ఇంట్లో కమెడియన్ పరిస్థితి అంతేనా?
Sudigali Sudheer : జబర్దస్త్ షోతో రాకెట్ రాఘవగా బాగానే గుర్తింపు సాధించాడు. జబర్దస్త్ షో మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చేసిన టీం లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాకెట్ రాఘవ మాత్రమే. అటు వెండితెర, ఇటు బుల్లితెరపై రాఘవ కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రాఘవ ప్రస్తుతం తన కొడుకు మురారిని కూడా నిలబెట్టేశాడు.
రాఘవ తన కొడుకు మురారిని ఈ మధ్య జబర్దస్త్ స్టేజ్ మీదకు, ఇతర షోలకు తీసుకొస్తున్నాడు. అయితే తాజాగా గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రాం ప్రసాద్ అందరూ కలిసి వెరైటీ స్కిట్ వేశారు. ఇందులో వెరైటీ అవుట్ డోర్ స్కిట్ అంటూ ముందుకు వచ్చారు. జబర్దస్త్ స్టేజ్ మీద స్కిట్ చేయకుండా.. రాకెట్ రాఘవ, హైపర్ ఆదిల ఇంటికి వెళ్తారు. తమ స్కిట్లలో గెస్ట్ అప్పియరెన్స్ చేయమని అడుగుతారు.
Sudigali Sudheer Team In Rocked Raghava Home
Sudigali Sudheer : రాఘవ ఇంట్లో సుడిగాలి సుధీర్ టీం..
ఈ క్రమంలో రాఘవ ఇళ్లును చూపించారు. అపార్ట్మెంట్‌లో ఉండే రాఘవ ఇళ్లు సౌకర్యవంతంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. సోఫా సెట్లు, హాలు, ఇంట్లోని ఫర్నిచర్ చూస్తుంటే రాఘవ రేంజ్ ఏంటో తెలుస్తోంది. మొత్తానికి రాఘవ, తన కొడుకు మురారి కలిసి దుమ్ములేపేశారు. భార్యకు భయపడే భర్తగా రాఘవ నటించేశాడు. ఇక మురారి అయితే ఆ ముగ్గురిని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు.