Sudigali Sudheer : మళ్లీ పిచ్చొళ్లని చేసేశారు.. సుడిగాలి సుధీర్ పెళ్లి డ్రామా.. అసలు కథ ఇదే
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి బుల్లితెరపై ఎప్పటికీ చెక్కు చెదరని కాన్సెప్ట్. సుధీర్ రష్మీ జోడి ఇప్పటికీ మ్యాజిక్ చేస్తూనే ఉంది. సుధీర్ రష్మీ జోడిది కేవలం స్కిట్ల వరకే అని అందరికీ తెలిసినా కూడా.. జనాలు మాత్రం నిజమని భ్రమ పడిపోతుంటారు. ఇక అభిమానులు అయితే వారిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటారు. ఇలా ఈ ఇద్దరి పెళ్లి మీద బుల్లితెరపై ఎన్నో ఈవెంట్లు వచ్చాయి.
టీఆర్పీల కోసమే ఇలా చేస్తుంటారని అందరికీ తెలుసు. ఇవన్నీ ప్రమోషన్స్ స్టంట్లు, స్ట్రాటజీలనీ జనాలకు తెలుసు. కానీ ఈ సారి మాత్రం కాస్త ఎక్కువ చేసేశారు. సుధీర్ పెళ్లి చూపులు అంటూ ఓ ప్రోమోను వదిలారు. ఆ తరువాత నలుగురు అమ్మాయిలతో కలిసి చేసిన స్కిట్‌ను వదిలారు. ఆ తరువాత అందరికీ విషయం అర్థమైంది. కానీ మొదటి ప్రోమో సమయంలో చాలా మంది నిజమని భావించారు.

Sudigali Sudheer Marriage Drama In Sridevi Drama Company
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి కథ ఇదే..
సదరు అమ్మాయి ఎవరంటూ తెగ వెదికేశారు. తేజస్వీ నాయుడు అని తెలిసి ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టేశారు. తీరా ఎపిసోడ్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. సుధీర్‌తో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందని అమ్మాయిలు కలగంటారట. అందులోని సీన్లే ఈ పెళ్లి, ఎంగేజ్మెంట్ల తంతు. మొత్తానికి జనాలను మరోసారి పిచ్చోళ్లని చేసేశాడు. అయితే ఇలాంటి టీఆర్పీ స్టంట్లను ఆ జనాలు అంతగా పట్టించుకోవడం కూడా మానేసినట్టున్నారు.