Prabhas : పుష్పని మించిన కథ సిద్ధం చేసిన సుకుమార్.. నరాలు తెగిపోయే సినిమాలో ప్రభాస్ హీరో .. బాలీవుడ్ వణికిపోయే న్యూస్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : పుష్పని మించిన కథ సిద్ధం చేసిన సుకుమార్.. నరాలు తెగిపోయే సినిమాలో ప్రభాస్ హీరో .. బాలీవుడ్ వణికిపోయే న్యూస్ !

 Authored By ramesh | The Telugu News | Updated on :13 November 2022,6:40 pm

Prabhas : బాహుబలి సినిమా నుంచి పాన్ ఇండియా వైడ్ గా ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. ప్రభాస్ తో సినిమా కోసం సౌత్ టు నార్త్ అందరు ప్లాన్ చేస్తున్నారు. అందులో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి. బాహుబలి తో బ్లాక్ బస్టర్ కొట్టి సాహో, రాధే శ్యామ్ నిరాశపరచినా నేషనల్ లెవల్ లో ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్న ప్రభాస్ ఓ పక్క సలార్ కూడా సెట్స్ మీద ఉంచాడు.

ఆ తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె, సందీప్ వంగాతో స్పిరిట్ సినిమాలు ఉన్నాయి. మారుతి డైరక్షన్ లో రాజా డీలక్స్ కూడా ఈ గ్యాప్ లో చేస్తున్నాడు. ఇక ఈ మూవీస్ అన్ని అయ్యాక మరో క్రేజీ కాంబో సెట్ చేసుకున్నారట ప్రభాస్. అది కూడా పుష్ప మేకర్ సుకుమార్ తో సినిమా ఉంటుందని టాక్. ప్రభాస్ సుకుమార్ ఈ కాంబో మూవీ డిస్కషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అంతకుముందు పాన్ ఇండియా ఇమేజ్ లేకపోయినా పుష్ప తో అల్లు అర్జున్ కి నేషనల్ వైడ్ కేజ్ వచ్చేలా చేశాడు సుకుమార్. అలాంటిది ప్రభాస్ కి ఆల్రెడీ బాలీవుడ్ లో బీభత్సమైన క్రేజ్ ఉంది. అలాంటి అతనితో ఎలాంటి సినిమా చేస్తారన్నై చూడాలి.

sukumar super story for prabhas bollywod

sukumar super story for prabhas bollywod

రంగస్థలం తో చరణ్ కెరియర్ లో బెస్ట్ హిట్ ఇచ్చిన సుకుమార్ ఆ తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప తీసి అతనికి పాన్ ఇండియా హిట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో కూడా మరో లెవల్ స్టోరీ సిద్ధం చేస్తున్నాడట. ఆ సినిమా కథ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు. ఈ న్యూస్ తెలిసి బాలీవుడ్ హీరోల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రభాస్ రేంజ్ తెలిపేలా రానున్న సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసేలా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రాజెక్ట్ కె సినిమానే పాన్ వరల్డ్ సినిమాగా వస్తుండగా సుక్కు వేసిన స్కెచ్ అంతకుమించి ఉంటుందని అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది