Suma Jayamma : ఈ ‘పంచాయితీ’ వర్కవుట్ అవుతుందా?.. సుమ న్యూ స్టెప్!
Suma Jayamma పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ ఇలా ఎన్ని రకాలుగా పిలిచినా సుమ గురించి చెబుతున్నారని అందరికీ అర్థమవుతుంది. అలాంటి సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోతోంది. మామూలుగా అయితే ఇది వరకు కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసింది. ఢీ, వర్షం వంటి సినిమాల్లో కొన్నీ సీన్స్ చేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఫుల్ లెంగ్త్ పాత్రను పోషించేందుకు రెడీ అయింది. ఓ రకంగా చెప్పాలంటే అది లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా కనిపిస్తోంది.
విలేజ్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశాడు. జయమ్మ పంచాయితీ అంటూ రాబోతోన్న ఈ సినిమాలో సుమ కనకాల ఎంతో ఇంటెన్సిటితో కనిపిస్తోంది. పాత కాలంలో మాదిరి రోలు, రోకలి పట్టుకుని సుమ కనిపిస్తున్నారు. సుమ ఎంతో కోపంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. సుమ రోకలి దెబ్బకు పగళ్లు వచ్చినట్టు కూడా కనిపిస్తోంది. మొత్తానికి ఏదో ఒక కొత్త ప్రయోగం చేసినట్టు కనిపిస్తోంది.
Suma Jayamma : ఊరి పెద్దగా సుమ..
ఇక ఆమె కొంగును చూస్తే.. గ్రామీణ వాతావరణానికి సంబంధించిన అంశాలు కనిపిస్తున్నాయి. ఇందులో సుమ ఊరి పెద్దలా నటిస్తున్నట్టున్నారు. ఫస్ట్ లుక్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. అనుష్ కుమార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే బుల్లితెరపై ఎంతో సరదాగా నవ్వించే సుమను అంత సీరియస్‌గా జనాలు చూస్తారా? అన్నదే అనుమానం.