Suman : సుమన్ చనిపోయినట్టు తప్పుడు వార్తలు.. సీరియస్ అయిన సీనియర్ నటుడు..!
Suman: సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగినప్పటి నుండి అందులో విస్తృత ప్రచారాలు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రచారాలలో ఎంత నిజం ఉందో, ఎంత అబద్ధం ఉందో తెలియక చాలా మంది కన్ఫ్యూజన్‌కి గురవుతున్నారు. ఒకానొక సమయంలో తెలుగు తెరపై స్టార్ హీరోగా వెలుగొందారు సుమన్. చిరంజీవి లాంటి అగ్ర హీరోకు పోటీ ఇస్తూ వరుస హిట్స్ అందుకున్నారు. రాను రాను కెరీర్ పరంగా కాస్త డీలా పడిన ఆయన ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యమున్న రోల్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు.అయితే తాజాగా తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించారు .
తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దు అంటూ..ఆయన తెలిపారు. ఒక సినిమా షూటింగ్ కోసం బెంగళూరులో ఉన్న సుమన్.. ప్రకటన రిలీజ్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పిచ్చి పిచ్చి న్యూస్ ను వైరల్ చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. అసలు విషయంలోకి వెళితే సుమన్ చనిపోయాడంటూ.. నార్త్ లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేశాయి. ఆ వార్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ కు చేరింది. అది కాస్తా వైరల్ అవ్వడంతో .. సౌత్ లో కూడా ఈ న్యూస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యింది. దీంతో అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఆందోళన చెందారు.
Suman : రూమర్స్‌కి చెక్..
ఈ వార్తలు సుమన్ చెంతకు చేరడంతో తనపై ఇలాంటి వార్తలు ప్రసారం చేసిన ఆ యూట్యూబ్ ఛానల్ పై చట్టపరంగా కేసు వేస్తానన్నారు సుమన్. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. రెగ్యూలర్ గా షూటింగ్స్ చేసుకుంటున్నానని. అటువంటిది తనపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా వార్తలు ఎలా ప్రాసారం చేస్తారంటూ మండిపడ్డారు. ఆ ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తానన్నారు సుమన్. హీరో సుమన్ తన అందం తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తమిళ హీరో అయినప్పటికీ టాలీవడ్ లో సుమన్ కు ఎంతో క్రేజ్ ఉంది.