Venkatesh : సుందరకాండ సినిమాలో సెకండ్ హీరోయిన్ అపర్ణ బ్యాక్‌గ్రౌండ్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?
Venkatesh : వెంకటేశ్ Venkatesh కి తమిళ హిట్ సినిమాలు బాగా కలిసివస్తాయి. ఆ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. అలా 1992లో తమిళంలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా సుందరకాండ. ఈ సినిమాకి భాగ్యరాజా దర్శకత్వం వహించాడు. తమిళంలో ఘన విజయం సాధించడంతో తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ. రైట్స్ కొని కథ వెంకటేశ్ కి చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా సుందరకాండ టైటిల్ తో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చింది.
1992లో వచ్చిన ఈ రీమేక్ సినిమాలో వెంకటేశ్ – మీనా జంటగా, అపర్ణ కీలక పాత్రలో నటించారు. తెలుగులో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మాస్ ఇమేజ్ సినిమాలు వెంకీ ఈ సినిమాలో కాలెజీ లెఖ్చరర్ పాత్రలో క్లాస్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇలాంటి క్యారెక్టర్ నీకు సూటవదని చాలామంది సలహాలిచ్చినా కూడా వెంకటేశ్ కథ, రాఘవేంద్ర రావు మీద అపారమైన నమ్మకంతో సుందరకాండలో నటించాడు. అయితే తమిళంలో భాగ్యరాజా వెంటపడే పాత్రలో సింధూజ అనే అమ్మాయి నటించింది.
Venkatesh : నిర్మాత కె.వి.వి,సత్యనారాయణ మేనకోడలయిన అపర్ణని తీసుకున్నారు.
అదే పాత్రకి అపర్ణ ని తీసుకున్నారు. అయితే ఆ పాత్రకి ఓ స్టార్ హీరోయిన్ ని లేదా కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకున్నారు రాఘవేంద్ర రావు. కానీ ఎవరూ అంతగా సూటవకపోవడంతో నిర్మాత కె.వి.వి,సత్యనారాయణ మేనకోడలయిన అపర్ణని తీసుకున్నారు. ఆమె ఎలా నటిస్తుందో అనుకున్న అందరికి అద్భుతంగా నటించి షాకిచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకి హీరోయిన్‌గా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ దాసరి నారాయణ రావు తెరకెక్కించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం సినిమాలో నటించి..2002లో పెళ్ళి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆమె సినిమాలకి దూరంగా ఉంది.