Bigg Boss Telugu 7 : ఈ హౌస్ లో తేజ కలుపు మొక్క.. శివాజీ అంత మాట అనేశాడేంటి.. నాగార్జున షాక్
Bigg Boss Telugu 7 : ఆదివారం సండే అంటేనే బిగ్ బాస్ హౌస్ లో ఫన్ డే. అవును.. వీకెండ్ ఎపిసోడ్స్ వచ్చాయంటే చాలు బిగ్ బాస్ హౌస్ లో సందడి మొదలవుతుంది. అంతే కాదు.. హోస్ట్ నాగార్జున కూడా వచ్చి ఇంటి సభ్యులతో సందడి చేస్తారు. ఈ ఆదివారం కూడా సూపర్ డూపర్ ఫన్ ఉండబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మూడో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ […]

Bigg Boss Telugu 7 : ఆదివారం సండే అంటేనే బిగ్ బాస్ హౌస్ లో ఫన్ డే. అవును.. వీకెండ్ ఎపిసోడ్స్ వచ్చాయంటే చాలు బిగ్ బాస్ హౌస్ లో సందడి మొదలవుతుంది. అంతే కాదు.. హోస్ట్ నాగార్జున కూడా వచ్చి ఇంటి సభ్యులతో సందడి చేస్తారు. ఈ ఆదివారం కూడా సూపర్ డూపర్ ఫన్ ఉండబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మూడో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది పక్కన పెడితే.. ఈరోజు ఎపిసోడ్ కోసం కంటెస్టెంట్లు అందరూ అదిరిపోయే డ్రెస్సులు వేసుకొని అదరగొట్టేశారు. ఆ డ్రెస్సులు మామూలుగా లేవు.

#image_title
వాళ్ల డ్రెస్సులు చూసి హోస్ట్ నాగార్జునే షాక్ అయ్యారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక.. యావర్, తేజ డ్రెస్సులు చూసి నాగార్జున షాక్ అవుతాడు. ఇక.. ఈరోజు ఫన్ డేలో భాగంగా చిట్టి ప్రశ్నలు అనే కొత్త టాస్క్ ను నాగార్జున ఇంటి సభ్యులతో ఆడిస్తాడు. శివాజీని పిలిచి ఈ హౌస్ లో కలుపు మొక్క ఎవరు అంటే.. చాలామంది ఉన్నారు సార్ అంటాడు శివాజీ. చివరకు తేజ.. ఈ ఇంట్లో కలుపు మొక్క అని శివాజీ చెప్పుకొచ్చారు. దీంతో అందరూ షాక్ అయ్యారు.
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ స్టేజీ మీద హీరో రామ్ సందడి
తాజాగా స్కంద హీరో రామ్ బిగ్ బాస్ స్టేజీ మీద సందడి చేశారు. రామ్ ను చూసి బిగ్ బాస్ కంటెస్టెంట్లు షాక్ అయ్యారు. సంతోషం ఫీల్ అయ్యారు. తన లేటెస్ట్ మూవీ స్కంద ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజీ మీద సందడి చేశాడు. ఇక… రామ్ ను చూసి లేడీ కంటెస్టెంట్లు ఎగిరి గంతేశారు. ఏంటి రామ్ నాతో అద్దాలు పెట్టుకొని మాట్లాడావు. అమ్మాయిలను చూసి స్పెడ్స్ తీసేశావు అంటూ నాగార్జున సరదాగా అంటాడు. మొత్తానికి ఈ వారం ఫుల్ టు ఫన్ ఉండబోతుందన్నమాట.