Sudheer : దొరికిందే చాన్స్ అనుకున్నాడేమో.. సుధీర్‌ను వాయించిన సన్నీ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudheer : దొరికిందే చాన్స్ అనుకున్నాడేమో.. సుధీర్‌ను వాయించిన సన్నీ!

 Authored By bkalyan | The Telugu News | Updated on :7 August 2021,6:38 pm

Sudheer జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ Sudheer , గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. స్కిట్లోనూ ఈ ముగ్గురికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే సన్నీ అనే క్యారెక్టర్ కూడా ఉంటుంది. వారి స్కిట్లతో సన్నీని ఓ తాగుబోతుగా ముద్ర వేసేశారు. అతను కూడా భారీ డైలాగ్‌లు ఇస్తే తడబడతాడు. ఈ ముగ్గురూ చేసే స్కిట్లలో దాదాపు సన్నీని కూడా పెడతారు. ఎప్పుడో అలా కొన్ని స్కిట్లలో కనిపించడు. ఎక్కువ డైలాగులు, స్క్రీన్ స్పేస్ కూడా ఉండదు.

Sunny Beats Sudheer In Extra Jabardasth

Sunny Beats Sudheer In Extra Jabardasth

సుధీర్‌ను వాయించిన సన్నీ Sudheer

అయితే అలాంటి సన్నీ టైం దొరికినప్పుడు మాత్రం వారిని ఆడుకుంటాడు. సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంటాడు. అంతే కాకుండా దొరికిందే చాన్స్ అనుకుని వారిని వాయించేస్తాడు. వాతలు పడేలా కొట్టేస్తాడు. స్కిట్లలో మామూలుగా అలా కొట్టాల్సిందిపోయి ఒళ్లంతా వాతలు పడేలా కొట్టేస్తాడు. తాజాగా వేసిన స్కిట్లోనూ ఈ ముగ్గురిని సన్నీ తెగ ఆడేసుకున్నాడు. సన్నీ కొట్టిన దెబ్బలకు ముగ్గురికి బాగానే వాచినట్టుంది. ఇక సుధీర్ Sudheer అయితే స్టేజ్ దిగి పారిపోయాడు.

Sunny Beats Sudheer In Extra Jabardasth

Sunny Beats Sudheer In Extra Jabardasth

రెట్రో లుక్కులో పాత కాలం నాటి సెటప్‌ గెటప్‌లో ముగ్గురూ వచ్చారు. కాలేజ్ స్టూడెంట్ల ఆ ముగ్గురూ వస్తే లెక్చరర్‌లా సన్నీ వచ్చేశాడు. ఇక సందు దొరికింది కదా అని ముగ్గురిని బెత్తంతో కొట్టేశాడు సన్నీ. సుధీర్ అయితే వద్దు వద్దు అంటూ ఉన్నా కూడా వినలేదు. విగ్గు ఊడిపడేలా కొట్టేశాడు. చివరకు ఆ దెబ్బలు తట్టుకోలేక సెట్ మీద నుంచి పారిపోయాడు. అలా సన్నీ స్టేజ్ మొత్తాన్ని ఆడుకున్నాడు. ఎంత కొట్టినా కూడా అదంతా కూడా స్కిట్లో భాగమే కావడంతో వారంతా దాన్ని స్పోర్టివ్‌గానే తీసుకుంటారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> వారి పట్ల నాకెప్పుడు విధేయత ఉంటుంది.. యాంకర్ అనసూయ అందాల జాతర

ఇది కూడా చ‌ద‌వండి ==> చీరకట్టినా కూడా కట్టనట్టే.. సురేఖా వాణి అందాల విందు!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎద అందాలు ఎరవేస్తూ క్యూట్ స్మైల్‌తో చంపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్ వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> సమంత లేటెస్ట్ జిమ్ వీడియో వైరల్.. వర్కౌట్స్‌లో కూడా ఊపిరాడనీయడం లేదు

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది