pragathi : రెచ్చిపోయిన ప్రగతి ఆంటీ… నాగిని పాటకు ఊర మాస్ స్టెప్పులు..!
pragathi : క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. తెలుగు ఇండస్ట్రీలో తల్లి, అత్త వంటి సపోర్టింగ్ పాత్రలు చేస్తూ తెలుగు చిత్రా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఎఫ్ 2 చిత్రంలో కామెడీ రోల్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించిన ప్రగతి… ఖాళీ సమయంలో సామాజిక మాధ్యమాల్లో కూడా తెగ బిజిగా మారుతోంది. ఫోటోస్.. అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఇన్ స్టా రీల్స్ లో డాన్స్ వీడియోలు, వర్కవుట్ వీడియోలను పోస్ట్ చేస్తూ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది.సినీ నటి ప్రగతి ఈ మధ్య సన్నగా మారి వెస్ట్రన్ డ్రెస్సుల్లో యువ హీరోయిన్ లకు ఏ మాత్రం తగ్గకుండా ఫోటో షూట్ చేయిస్తోంది. తాజాగా నాగిని పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి యువతను ఆకట్టుకుంది.
జిమ్లో వర్కవుట్స్ చేస్తూ తనదైన స్టైల్లో స్టెప్పులేసిన ఈ వీడియోకు ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రగతి తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు చిన్న నాటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని అన్నారు. అలాగే ఎప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ద చూపుతూ యోగ వంటివి చేసేదాన్ని అని అన్నారు. ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ గురించి తెలియజేస్తూ మహిళల్లో స్పూర్తి నింపుతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.నటి ప్రగతి తెలుగు చిత్ర పరిశ్రమలో.. ఉన్న దాదాపు అందరు హీరోలకు తల్లి పాత్రలో నటించారు.

supporting actress pragathi dance going viral in social media
pragathi : హీరోయిన్ లకు దీటుగా ప్రగతి హాట్ అందాలు..:
2002 బాబి సినిమా నుంచి ప్రగతి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. కేవలం తల్లి పాత్రలోనే కాకుండా అప్పుడప్పుడు కొన్ని హాస్య భరితమైన రోల్స్ తో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా చిరుత సినిమాలో ఆమె తల్లిగా నటించి మంచి క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ఆమె కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయ్యాయి.ప్రగతి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా దర్శనమిస్తోంది. సినిమాల్లో ఆమె తల్లి పాత్రలో కాస్త వయసున్న మహిళ గా కనిపించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నేటితరం కుర్రాళ్లను తన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంటోంది. అసలు ఈ ఫోటోలో ఉన్నది ప్రగతి అంటే ఎవరు నమ్మరు ఏమో అనే విధంగా ఆమె గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.
View this post on Instagram