Surekha vani : క‌చ్చా బాద‌మ్ పాట‌కు హోయ‌లు పోతూ చిందులేసిన సురేఖా ఆమె కూతురు.. అరాచ‌కం వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Surekha vani : క‌చ్చా బాద‌మ్ పాట‌కు హోయ‌లు పోతూ చిందులేసిన సురేఖా ఆమె కూతురు.. అరాచ‌కం వీడియో..!

 Authored By sandeep | The Telugu News | Updated on :14 February 2022,12:30 pm

Surekha vani : పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని లక్ష్మీనారాయణపూర్ పంచాయతీలోని కురల్‌జూరి గ్రామంలో నివసిస్తుంటాడు భుబన్ బద్యాకర్. పచ్చి వేరుశెనగ అమ్మడానికి సైకిల్‌పై వివిధ ప్రాంతాలకు వెళుతుంటాడు. ఆ విధంగా పల్లీలు అమ్ముతూ రోజుకు రూ.250 సంపాదిస్తాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కచ్చా బాదం (పచ్చి పల్లీలు) అమ్ముకుంటున్న భుబన్ బద్యాకర్.. తాను అరుస్తూ అమ్ముతున్న విధానం కొందరికి నచ్చింది. దాంతో అది కాస్తా వైరల్ అయ్యింది.ఇప్పుడు సెల‌బ్రిటీలు ఈ పాట‌కు తెగ చిందులేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. కొన్ని వారాలుగా ఈ పాట ఊపే ఊపుడుకు ఒక్క ఇన్ స్టా రీల్సే కాదు.. షార్ట్స్, జోష్, మాజ్.. అన్ని షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ లు షేకవుతున్నాయి.

ఓ పల్లెటూరి పాటగాడు.. బాదామ్.. బాదామ్.. కచ్చా బాదామ్ అంటూ పాడే ఈ పాట గమ్మత్తుగా ఉంటుంది. మంచి మ్యూజిక్ బీట్ ఉండటంతో.. స్టెప్ కూడా వైరల్ అయింది. అదే స్టెప్పుకు ఎక్స్ ప్రెషన్స్ మిక్స్ చేసి.. రిపీట్ చేసి లైక్‌లు, కామెంట్లు కొట్టేస్తున్నారు సెలబ్రిటీలు, టాలెంటెడ్ యూజర్స్.ఇప్పటికే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ.. కచా బాదం పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్ కూడా ప్రియా ప్రకాష్ వారియర్ ఈ పాటకు స్టెప్పులేస్తూ అద‌ర‌గొట్టారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో సురేఖ చేరింది.

Surekha vani : అద‌ర‌గొట్టేశారుగా..

surekha vani dance with suprita Video

surekha vani dance with suprita Video

సురేఖ ఆమె కూతురు ఈ పాట‌కి చిందులేశారు. ఇద్ద‌రు ఎప్పటి మాదిరిగానే జోష్‌తో తెగ చిందులేస్తూ ర‌చ్చ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెలబ్రిటీ హోదాలో సురేఖావాణి చిందులాటకు, సెలబ్రిటీ కిడ్‌గా సుప్రిత అందాలు యాడ్ అవుతూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుంటాయి. ఎవ్వరు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా, ఏ విధంగా రియాక్ట్ అయినా తమ లైఫ్ స్టైల్ తమదే అన్నట్లుగా ఆ ఇద్దరూ నెట్టింట హవా నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కూతురితో కలిసి సురేఖావాణి చేసిన ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది