Surekha Vani : దూరంగా వెళ్లిపోతోన్నా మిస్ యూ!.. షాకిచ్చిన సురేఖా వాణి కూతురు

Authored By Cinema Desk | The Telugu News | Updated on: September 5, 2021, 7:58 pm

Surekha Vani : Surekha Vani కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇన్ స్టాగ్రాంలో తల్లితో పోటీ పడుతూ అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇక సుప్రిత, సురేఖా అందాచెందాలకు పడిపోని నెటిజన్ ఉండరు. ఈ ఇద్దరూ తల్లికూతుళ్లా? లేక అక్కాచెల్లెళ్లా? ఫ్రెండ్సా? అంటూ నెటిజన్లు ఆటపట్టిస్తుంటారు. అలా నిత్యం ఇన్ స్టాగ్రాంలో యాక్టివ్‌గా ఉంటుంది సుప్రిత.

Surekha Vani Dauhgter Supritha Quits Instagram

Surekha Vani Dauhgter Supritha Quits Instagram

అలాంటి సుప్రిత సడెన్‌గా షాకిచ్చింది. తాను ఇన్ స్టాగ్రాం నుంచి బయటకు వెళ్లిపోతోన్నాను అని తన నిర్ణయాన్ని చెప్పేసింది. దీంతో నెటిజన్లు తెగ జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందా? అంటూ ఏమైనా జరిగిందా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో చివరగా మళ్లీ ఓ ట్విస్ట్ ఇచ్చింది. త్వరలోనే వస్తాను.. మీ ప్రేమ, మద్దతు ఇలాగే ఉండాలని సుప్రిత కోరింది. సుప్రిత తాజాగా వేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Surekha Vani Dauhgter Supritha Quits Instagram

Surekha Vani Dauhgter Supritha Quits Instagram

తాను ఇన్ స్టా నుంచి దూరంగా వెళ్లిపోతోన్నాను అని చెబుతూ.. ‘కొన్ని రోజుల వరకు ఇన్ స్టా నుంచి దూరంగా వెళ్లిపోతున్నాను. మళ్లీ త్వరలోనే తిరిగి వస్తాను. మిమ్మల్ని కచ్చితంగా మిస్ అవుతాను.. మీ ప్రేమ, మద్దతు నాకు ఇలానే కావాలి’ అంటూ సుప్రిత పేర్కొంది. అయితే ఇలా వెళ్లిపోవడానికి గల కారణాలు మాత్రం సుప్రిత వెళ్లడించలేదు. మొత్తానికి సుప్రిత మాత్రం మంచి నిర్ణయమే తీసుకున్నట్టుంది. మళ్లీ తిరిగి ఎప్పుడు వస్తుందో చూడాలి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp