Surekha Vani : త్వరగా తిరిగిరా పార్టీ చేసుకోవాలి.. సురేఖా వాణి ఎమోషనల్
Surekha Vani : హోళీ పండుగ రోజు జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలో జరిగిన ఈ కారు ప్రమాదం గాయత్రి, ఆమె స్నేహితుడు కూడా మరణించారు. మద్యం తాగిన మత్తులో కారుని నడిపినట్టు తెలుస్తోంది. కొబ్బరి బోండాల్లో మద్యం నింపుకుని మరీ తాగినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ ప్రమాదంలో యువ నటి మరణించింది.
అయితే ఈ ప్రమాదంలో మరణించిన గాయత్రి ఇన్ స్టాగ్రాంలో ఫులో ఫేమస్. డాలీ డిక్రూజ్ అనే పేరుతో ఈమె ఖాతా ఉంటుంది. గాయత్రికి సుప్రిత మంచి స్నేహితురాలు. సురేఖా వాణి ఇంట్లోనే ఈ గాయత్రి కనిపిస్తుంటుంది. సురేఖా వాణిని రెండో అమ్మ అని అంటూ గాయత్రి చెబుతూ ఉండేది. గాయత్రి ఇలా సడెన్‌గా మరణించడంతో సురేఖా వాణి ఎమోషనల్ అవుతోంది.
Surekha Vani Emotional Post on Junior Artist Gayathri Death
Surekha Vani : సురేఖా వాణి కంటతడి..
తాజాగా సురేఖా వాణి ఓ పోస్ట్ చేసింది. ఈ అమ్మను వదిలేసి ఎలా వెళ్లిపోతావ్.. మనిద్దరం కలిస ఎన్నోగొప్ప క్షణాలను గడిపాం.. నేను ఇది ఇంకా నమ్మలేకపోతోన్నాను. మనం మంచి పార్టీలు చేసుకుంది.. త్వరగా తిరిగిరా.. ఎంతో షేర్ చేసుకునేది ఉంది.. కలిసి ఇంకా ఎన్నో చేయాల్సినవి ఉన్నాయ్.. తిరిగి రా.. ఇది వెళ్లాల్సిన సమయం కాదు.. ఇంత త్వరగా వెళ్లాల్సినదానివి కాదు.. నిన్ను మిస్ అవ్వాలని అనుకోవడం లేదు.. లవ్యూ ఫరెవర్ అంటూ సురేఖా వాణి ఎమోషనల్ అయింది.