Surekha vani : గోవాలో ఆ రుచుల కోసం వెదుకులాట..కూతురితో సురేఖా వాణి హల్చల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 10, 2021, 2:00 pm

Surekha vani : సురేఖా వాణి, సుప్రిత ఇప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలిసిందే. కూతురు బర్త్ డే అని సురేఖా వాణి గోవాలో భారీ ప్రణాళికలు వేసినట్టుంది. కూతురి బర్త్ డే పార్టీని సురేఖా వాణి గోవాలో ఇచ్చేసింది. దీని కోసం సుప్రిత తన గ్యాంగును వేసుకుని గోవాకు వెళ్లింది. ఇక అక్కడ ఈ తల్లీకూతుళ్లు చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. గోవాలో బీచ్‌లు, పబ్‌లు అంటూ బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఈ పార్టీలో తల్లీకూతుళ్లు కాకుండా సుప్రిత ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.

Surekha vani Supritha Food In Goa

Surekha vani Supritha Food In Goa

గోవాలో ఎక్కువగా నార్త్ ఫుడ్ దొరుకుతుంది. మన స్టైల్లో అక్కడ ఆహారం దొరకడం కష్టమే అవుతుంది. కానీ మన స్టైల్ ఫుడ్ కోసం సురేఖా వాణి, సుప్రిత తెగ తిరిగారట. అంతే కాకుండా ఓ రెస్టారెంట్‌లో మన తెలుగు వంటలు అదిరిపోయాయని చెప్పుకొచ్చింది. లొట్టలేసుకుంటూ సుప్రిత తింటున్న వీడియోను షేర్ చేసిన సురేఖా వాణి.. అక్కడ కనీసం ఒక్కసారైనా రుచి చూడాల్సిందేనని చెప్పుకొచ్చింది. మొత్తానికి రుచుల వేటలో గోవా మొత్తం చుట్టేస్తున్నట్టున్నారు.

గోవాలో ఆ రుచుల కోసం వెదుకులాట..కూతురితో సురేఖా వాణి హల్చల్

మామూలుగా వెకేషన్ అంటే ఎప్పుడూ కూడా ఈ తల్లీ కూతుళ్లు గోవాకు వెళ్తుంటారు. ఇన్ని రోజులు కరోనా, లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఇలా చాన్స్ దొరికింది. సుప్రిత బర్త్ డేను గోవాలో ప్లాన్ చేశారు. ఇక ఈ ఇద్దరూ వెజ్, నాన్ వెజ్ ఐటెంల గురించి గోవా అంతా తిరుగుతున్నారట. ఆంధ్ర భోజనం గోవాలో ఎక్కడ దొరుకుతుందా? అని ట్రయల్స్ వేస్తున్నామని చెప్పుకొచ్చింది. ఈ తల్లీకూతుళ్లిద్దరూ కూడా మంచి భోజన ప్రియులే అన్నట్టు కనిపిస్తోంది.

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp