Supritha : సుప్రిత ఒంటిపై కొత్త టాటూ.. అక్కడ వేయించుకున్నట్టు చూపించేసిందిగా

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 30, 2022, 7:30 pm

Supritha : సురేఖా వాణి కూతురు సుప్రిత నెట్టింట్లో చేసే సందడి మామూలుగా ఉండదు. సురేఖా వాణి, సుప్రిత ఇద్దరూ నెట్టింట్లో హంగామా చేస్తుంటారు. ఈ ఇద్దరూ చూసే అందాల ఆరబోత మామూలుగా ఉండదు. తల్లీకూతుళ్లిద్దరూ కూడా నెట్టింట్లో అందాల ప్రదర్శన చేయడంతో ఏ మాత్రం తగ్గరు. ఇక ఈ ఇద్దరినీ అలా చూస్తూ నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అయితే ఈ ఇద్దరూ ఇప్పుడు వెకేషన్లో ఉన్నారు. మూడు నాలుగు రోజుల క్రితం ఈ ఇద్దరూ గోవాకు చెక్కేశారు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. నైట్ క్లబ్బు, పబ్బులు, పార్టీలు అంటూ గోవాలో ఈ తల్లీకూతుళ్లు సందడి చేస్తున్నారు. మొత్తానికి సుప్రిత మాత్రం ఇప్పుడు ఓ పోస్ట్ చేసింది.

అందులో తాను కొత్తగా వేసుకున్న టాటూ గురించి చెప్పింది. అసలే ఈ మధ్య అందరూ టాటూల మీద పడ్డారు. వింత వింత టాటూలు వేసుకోవడం ఓ ట్రెండ్ అయింది. ఇక సెలెబ్రెటీల్లో అయితే ఈ కల్చర్ మరింత ఎక్కువైంది. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక టాటూ వేయించుకుంటున్నారు. కొందరు పేర్లు రాసుకుంటే.. ఇంకొందరు వేరే భాషల్లో పేర్లు రాయించుకుంటారు. ఇంకొందరు సింబల్స్ వేసుకుంటుంటారు. ఇక సుప్రిత ఇప్పుడు ఓ రోజ్ పువ్వును తన కాలి మీద టాటూగా వేయించుకుంది. ఈ విషయాన్ని సుప్రిత చూపించింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియోల్లో పొట్టి బట్టల్లో కనిపించింది.

Surekha vani Daughter Supritha Tattoo Goes Viral

Surekha vani Daughter Supritha Tattoo Goes Viral

తన కొత్త టాటూను చూపిస్తూ మురిసిపోయింది. మొత్తానికి సుప్రిత మాత్రం ఇప్పుడు గోవాలో దుమ్ములేపుతోంది. సురేఖా వాణి, సుప్రిత నిత్యం ఏదో ఒక చోటుకు వెళ్తుంటారు. గత నెలలో థాయ్లాండ్‌కు వెళ్లారు. బ్యాంకాక్‌లో థాయ్ మసాజ్ అంటూ ఈ తల్లీకూతుళ్లు బాగానే ఎంజాయ్ చేశారు. సుప్రిత తన తల్లి బర్త్ డేను విదేశాల్లోనే సెలెబ్రేట్ చేసింది. ప్రస్తుతం సుప్రిత సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్టుంది. ఇందులో భాగంగా యాడ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ తెగ సందడి చేస్తోంది. మొత్తానికి సురేఖా వాణితో పాటుగా షూటింగ్ సెట్‌లోకి సుప్రిత ఎంట్రీ ఇస్తుంటుంది. ఈ ఇద్దరూ కలిసి ఆన్ సెట్‌లోనూ అల్లరి చేస్తుంటారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp